Elaichi Water Benefits: ఉదయాన్నే యాలకులు వేసి మరిగించిన నీటిని తాగితే.. ఏమవుతుందో తెలుసా..?

యాలకులలో బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను శాశ్వతంగా తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్ అయిన సినియోల్, దుర్వాసన బాక్టీరియాను చంపడానికి, కావిటీస్ మరియు దంత క్షయాన్ని నిరోధించడానికి తెలిసిన శక్తివంతమైన క్రిమినాశకగా పనిచేస్తుంది. 

Elaichi Water Benefits: ఉదయాన్నే యాలకులు వేసి మరిగించిన నీటిని తాగితే.. ఏమవుతుందో తెలుసా..?
Elaichi Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2023 | 9:50 PM

యాలకులు..ప్రతి వంటింట్లో లభించే ముఖ్యమైన మసాలా దినుసు. వంటల రుచి, మంచి వాసన కోసం యాలకులను ప్రతి ఇంట్లోనూ వాడుతుంటారు. యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. యాలకులు అనేక పోషకాలకు నిధి.. విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్‌, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అనేకం ఈ యాలకుల్లో లభిస్తాయి. ఇలాంటి యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఇది బరువు నియంత్రణలో ఉంచేందుకు కూడా సహయపడుతుంది. యాలకులతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

యాలకుల నీటిని రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? రోజూ యాలకుల నీటిని తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుండి బయటపడవచ్చు. రోజూ ఒక గ్లాసు యాలకుల నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాలకుల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాలకుల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా, కడుపునొప్పి నుండి ఉపశమనం పొందడంతోపాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాలకులతో మరిగించిన నీటిని తాగటం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

యాలకులకు డిప్రెషన్‌తో పోరాడే ప్రత్యేక సామర్థ్యం ఉంది. మీ రోజువారీ టీలో ఏలకులను వేసి గానీ, లేదంటే ఏలకుల పౌడర్‌ గానీ వేసుకుని తాగితే..మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తమాను నివారించడంలో యాలకులు చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు యాలకుల నీటిని తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. యాలకులలో బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను శాశ్వతంగా తొలగించడంలో సహాయపడుతుంది. యాలకులలో లభించే ఫైటోకెమికల్ అయిన సినియోల్, దుర్వాసన బాక్టీరియాను చంపడానికి, కావిటీస్ మరియు దంత క్షయాన్ని నిరోధించడానికి తెలిసిన శక్తివంతమైన క్రిమినాశకగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..