Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ మహిళలకు గొప్ప శుభవార్త.. ఆడబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా మరో 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు..

ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేసే అన్ని చికిత్సలు ఇక్కడ లభిస్తున్నాయి. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో మహిళలకు అందే 8 ర‌కాల సేవ‌లు ఇలా ఉన్నాయి..

తెలంగాణ మహిళలకు గొప్ప శుభవార్త.. ఆడబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా మరో 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు..
Arogya Mahila
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2023 | 9:39 PM

మహిళల ఆరోగ్యానికి ప్రధాన్యత నిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. అందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2023 మార్చిలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం నేడు మహిళల కోసం వారానికో ప్రత్యేక క్లినిక్‌లను నిర్వహించే మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబరు 12 నుంచి అదనంగా మరో 100 కేంద్రాల నిర్వహణను ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి టి. హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఆరోగ్య మహిళా పథకాన్ని 272 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, వచ్చే మంగళవారం నుంచి మరిన్ని కేంద్రాలు మహిళల కోసం అందుబాటులోకి రానున్నాయి. దీంతో మహిళల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన హెల్త్‌ సెంటర్ల సంఖ్య 372కి పెరిగింది. ఆరోగ్య మహిళా క్లినిక్‌లు వారంలో ప్రతి మంగళవారం నిర్వహించబడతాయి. ముందస్తు రోగ నిర్ధారణలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రయోగశాల పరీక్షల శ్రేణిని నిర్వహిస్తోంది. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఆడవాళ్లకు 8 రకాల వ్యాధులకు సంబందించిన చికిత్స అందుతుంది. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేసే అన్ని చికిత్సలు ఇక్కడ లభిస్తున్నాయి. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆరోగ్య మహిళ కార్యక్రమంలో మహిళలకు అందే 8 ర‌కాల సేవ‌లు ఇలా ఉన్నాయి..

డయాబెటిస్‌, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కూడా చేస్తారు. థైరాయిడ్ టెస్ట్‌ కూడా చేస్తున్నారు. సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి వాటిని తగిన మందులను అందజేస్తున్నారు. అయోడిన్ లోపం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి తగిన మందులు అందజేస్తున్నారు. విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు కూడా చేస్తున్నారు. తగిన మెడిసిన్‌ కూడా అక్కడ అందజేస్తున్నారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు సంబంధిచిన టెస్టులు, చికిత్స కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు.

ఇవి కూడా చదవండి

సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేస్తారు. మోనోపాజ్ దశకు సంబంధించిన టెస్టులు కూడా నిర్వహిస్తారు. రిపోర్ట్స్‌ ఆధారంగా అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా చేస్తున్నారు. బాధితులకు సరైన కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..