North Korea’s Kim Jong Un: లగ్జరీ, బుల్లెట్‌ఫ్రూఫ్ రైలులో నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రష్యా పర్యటన..
కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణిస్తున్నప్పుడు, అతనితో పాటు మరో మూడు రైళ్లు నడుస్తాయి. ఆ మూడు రైళ్లలో ఒకటి రైల్వే లైన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వెళ్తుంది. రెండవ రైలు భద్రతా సిబ్బందిని తీసుకువెళుతుంది. మూడవ రైలు ఇతర అధికారుల కోసం కేటాయించబడింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ నియంతల ప్రపంచ ప్రసిద్ది. అతడు తీసుకునే నిర్ణయాల కారణంగా అతడు ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయంతో కిమ్ వార్తల్లో కెక్కాడు. కిమ్ జాంగ్ ఉన్ ఈ నెలలో రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ జాంగ్ ఉన్ భేటీ కానున్నారు. కిమ్ జోంగ్ ఉన్ తన రష్యా పర్యటన కోసం తన ప్రత్యేక బుల్లెట్ ప్రూవ్ రైలులో ప్రయాణించాలని భావిస్తున్నారట.
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యాకు వెళ్లేందుకు తన ప్రైవేట్ రైలును ఉపయోగించనున్నారు. అతను తన తండ్రి నుండి ఈ రైలును వారసత్వంగా పొందాడు. కిమ్ జోంగ్ ఉన్ ప్రైవేట్ రైలులో ఫైవ్ స్టార్ హోటల్, ప్యాలెస్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు..ఈ రైలు సగటు వేగం గంటకు 37 మైళ్లు. కిమ్ జోంగ్ ప్రైవేట్ రైలు బుల్లెట్ ప్రూఫ్ కూడా. కిమ్ జోంగ్ ఉన్ ఈ రైలు భద్రత చాలా పటిష్టంగా ఉంటుందని సమాచారం.
దక్షిణ కొరియా మీడియా నివేదికల ప్రకారం, రైలుకు 100 మంది సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉంటారు. ఈ గార్డ్‌లు బాంబులు, ఇతర ప్రమాదకర, పేలుడు పదార్థాకలు గురికాకుండా ఉండేందుకు..ఎప్పటికప్పుడు ముందస్తుగానే వచ్చే స్టేషన్‌లను స్కాన్ చేసి, ఆపై రైలు ముందుకు సాగుతుంది. కిమ్ జోంగ్ ఉన్ రైలులో ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, అనేక బెడ్ రూములు, శాటిలైట్ ఫోన్లు, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు కూడా ఉన్నాయి. రైలులోని ప్రతి కోచ్‌లో విశాలమైన బాత్‌రూమ్‌లు, డైనింగ్ హాల్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి. రైలులోని ప్రతి కోచ్‌లో సర్వీస్ కోసం ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారట. కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణిస్తున్నప్పుడు, అతనితో పాటు మరో మూడు రైళ్లు నడుస్తాయి. ఆ మూడు రైళ్లలో ఒకటి రైల్వే లైన్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వెళ్తుంది. రెండవ రైలు భద్రతా సిబ్బందిని తీసుకువెళుతుంది. మూడవ రైలు ఇతర అధికారుల కోసం కేటాయించబడింది.
2002లో, రష్యా అధికారి ఒకరు కిమ్ జోంగ్‌తో కలిసి మాస్కోకు వెళ్లారు. కిమ్ జాంగ్ ప్రత్యేక రైలులోని సౌకర్యాల గురించి ఆ అధికారులు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించి అధ్యక్షుడు పుతిన్‌తో ఆయుధాలపై చర్చిస్తారని సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..