Andhra Pradesh: ఆ స్థలం ఉసురు తీసింది..! అదే లేకుంటే ఆమె..!! అనాధలుగా ఇద్దరు చిన్నారులు..

Anakapalle District: పదేళ్ల క్రితం పెళ్లిలో కట్న కానుకులతో పాటు.. 50 సెంట్ల భూమి కూడా రాసిచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తాగుడుకు అలవాటు పడిన లక్ష్మణ.. అపర్ణను వేధించడం ప్రారంభించాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులతో పాటుగా అపర్ణ వద్ద ఉన్న మొత్తాన్ని కూడా తీసుకెళ్లి మధ్యం తాగేసేవాడు. చివరకు పనికి వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలో పెళ్లికి కానుకగా ఇచ్చిన 50 సెంట్ల స్థలంపై వాడి కన్ను పడింది.

Andhra Pradesh: ఆ స్థలం ఉసురు తీసింది..! అదే లేకుంటే ఆమె..!! అనాధలుగా ఇద్దరు చిన్నారులు..
Crime Scene
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 09, 2023 | 1:23 PM

విశాఖపట్నం, సెప్టెంబర్09: – ఎంత పేదవాడైనా స్తోమతను బట్టి పెళ్లి సమయంలో కట్న కానుకలు ఇవ్వడం కామన్..! గ్రామీణ ప్రాంతంలో అయితే ఉన్న పొలాన్ని రాసిచ్చేస్తారు. అలాగే ఓ పెయింటర్‌కు పిల్లనిచ్చి.. 50 సెంట్లు పొలాన్ని రాసి.. పదేళ్ల క్రితం పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే, తాగుడు బానిసైన ఆ వ్యక్తి తాగేందుకు డబ్బులు లేక చివరకు… కట్నంగా ఇచ్చిన ఆ భూమిపై కూడా కన్ను పడింది. ఇక దాన్ని అమ్మేసి తిని తాగాలని చూసాడు..అనుకున్నదే ఆలస్యం భార్యపై వేధింపులు ప్రారంభించాడు. చివరకు…!

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోస పామూరు గ్రామంలో అపర్ణ అనే యువతి కి వడ్డిప గ్రామానికి చెందిన లక్ష్మణ్ తో పెళ్లి జరిగింది. పదేళ్ల క్రితం పెళ్లిలో కట్న కానుకులతో పాటు.. 50 సెంట్ల భూమి కూడా రాసిచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తాగుడుకు అలవాటు పడిన లక్ష్మణ.. అపర్ణను వేధించడం ప్రారంభించాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులతో పాటుగా అపర్ణ వద్ద ఉన్న మొత్తాన్ని కూడా తీసుకెళ్లి మధ్యం తాగేసేవాడు. చివరకు పనికి వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలో పెళ్లికి కానుకగా ఇచ్చిన 50 సెంట్ల స్థలంపై వాడి కన్ను పడింది. ఇక దాన్ని అమ్మే పని ప్రారంభించాడు లక్ష్మణ. భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అదనపు కట్నం కోసం గొడవపడేవాడు. డబ్బులు తేకపోతే 50 సెంట్లు స్థలాన్ని అమ్మి పెట్టాలని ప్రతిరోజూ వేదించసాగాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడుతూ తరచూ ఆమెపై దాడి చేసేవాడు. అక్కడితో ఆగకుండా చివరకు ఆమెను గొంతును నులిపేశాడు. దీంతో అపర్ణ ఊపిరాడకుండా చనిపోయిందని అంటున్నారు పోలీసులు. అపర్ణ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.

– తాగుడుకు బానిసై.. చివరకు కట్టుకున్న భార్యని కడతేర్చాడు ఆ భర్త. భర్త కరకసత్వానికి అపర్ణ ప్రాణాలు కోల్పోగా… ఇప్పుడు లక్ష్మన్న కటకటాల పాలవుతున్నాడు. వాడు చేసిన తప్పుకు ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట