AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Babu Naidu Arrest: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన దర్శకుడు రాఘవేంద్రరావు.. ఏమన్నారంటే ?

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టవ్వడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆయన అరెస్టు చేయడంతో టీడీపీ నేతలు,కార్యరకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని.. ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత తీవ్రంగా ఖండించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశంపై ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్పందించారు. చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యిందని అన్నారు.

Chandra Babu Naidu Arrest: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన దర్శకుడు రాఘవేంద్రరావు.. ఏమన్నారంటే ?
Director Raghavendra Rao
Aravind B
|

Updated on: Sep 09, 2023 | 1:26 PM

Share

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టవ్వడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆయన అరెస్టు చేయడంతో టీడీపీ నేతలు,కార్యరకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని.. ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత తీవ్రంగా ఖండించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశంపై ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్పందించారు. చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యిందని అన్నారు. ఒక విజన్ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే విధానం అప్రజాస్వామికమని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని చచ్చిపోతున్నందుకు బాధపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అరెస్టు.. శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబు నాయుడ్ని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయన్ని విజయవాడ మెజిస్ట్రేట్‌లో ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిధులు మళ్లించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని.. ఇందులో 550 కోట్ల మేరకు అక్రమాలు గుర్తించామని అన్నారు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 371 కోట్ల రూపాయలను.. డిజైన్ టెక్‌తో పాటు ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్లు తేలిందని పేర్కొన్నారు. సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయని వివరించారు. అలాగే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిలో చంద్రబాబు ప్రధాన కుట్రదారు అని ఇన్నారు.

అలాగే వికాస్ కన్వెల్కర్‌తో పాటు ఇతర నిందితులు ఈ అక్రమాల్లో నిందితులగా ఉన్నారని చెప్పారు. అయితే ఈ కేసుల్లో మజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కస్టడీలోకి తీసుకోని విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి కార్యదర్శితో సహా చంద్రబాబు తనయుడి పాత్ర పైనా కూడా దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉందని.. అందుకే ఆయన అరెస్టు అనివార్యం అయినట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..