DK Aruna: గవర్నర్‌ను కలిసిన డీకే అరుణ.. తనను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ..

హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేత డీకే అరుణ. 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన క్రిష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన స్థానంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ.. వారం, పది రోజులు అవుతున్నా హైకోర్టు తీర్పు అమల్లోకి రావడంలేదు. వాస్తవానికి.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీర్పు కాపీని తీసుకుని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు డీకే అరుణ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు.

DK Aruna: గవర్నర్‌ను కలిసిన డీకే అరుణ.. తనను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ..
Governor Tamilisai, Dk Aruna
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2023 | 10:05 PM

హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేత డీకే అరుణ. 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన క్రిష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన స్థానంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ.. వారం, పది రోజులు అవుతున్నా హైకోర్టు తీర్పు అమల్లోకి రావడంలేదు. వాస్తవానికి.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీర్పు కాపీని తీసుకుని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు డీకే అరుణ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. నిర్లక్ష్యం జరుగుతోందని గుర్తించిన డీకే అరుణ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దాంతో.. తక్షణమే క్రిష్ణమోహన్‌ను అనర్హుడిగా ప్రకటించి.. డీకె అరుణతో ప్రమాణ స్వీకారం చేయించాలని అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఆ లేఖను తీసుకుని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని కలవడంతో గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదేసమయంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు డీకే అరుణ. అది జరిగి కూడా రెండు రోజులు గడుస్తున్నా.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు డీకే అరుణ. తాజాగా.. గవర్నర్‌ తమిళిసైని కలిశారు డీకే అరుణ. ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను గవర్నర్‌కు అందజేసి.. అసెంబ్లీ సెక్రటరీని కలిసేందుకు వెళ్తే ఆయన చాంబర్‌లో ఉండడం లేదని వివరించారు. ఇక.. ప్రమాణ స్వీకారానికి సమయం ఇప్పించాలని కోరగా.. గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు డీకే అరుణ.

ఇవి కూడా చదవండి

ఇక.. 2018లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు పత్రాలు సమర్పించారంటూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణల తర్వాత కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటేసింది హైకోర్టు. అయితే.. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్న చందంగా మారింది డీకే అరుణ పరిస్థితి. ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. దానిని అమలు చేయాల్సిన యంత్రాంగం తాత్సారం చేస్తుందని ఆరోపిస్తున్నారామె. ఇప్పుడు గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

గవర్నర్ తమిళి సై తో డీకే అరుణ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..