AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం కేసీఆర్‌ను చూసి ఎంతో నేర్చుకున్న.. గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శలకు, కోర్టు కేసులకు తాను భయపడేదాన్ని కాదని.. ప్రొటోకాల్ ఉల్లంఘనలతో కట్టడి చేయలరేని అన్నారు. అలాగే నా బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నానని అన్నారు. అయితే ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవాలని.. లేదా కోట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. గవర్నర్‌గా నాలుగు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా రాష్ట్ర ప్రజల సేవలో 5వ ఏడాది ప్రారంభం పేరిట శుక్రవారం రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్‌బుక్‌ను ఆమె ఆవిష్కరించారు.

Telangana: సీఎం కేసీఆర్‌ను చూసి ఎంతో నేర్చుకున్న.. గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
Telangana Governor Tamilisai (File Photo)
Aravind B
|

Updated on: Sep 09, 2023 | 6:55 AM

Share

తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శలకు, కోర్టు కేసులకు తాను భయపడేదాన్ని కాదని.. ప్రొటోకాల్ ఉల్లంఘనలతో కట్టడి చేయలరేని అన్నారు. అలాగే నా బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నానని అన్నారు. అయితే ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవాలని.. లేదా కోట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. గవర్నర్‌గా నాలుగు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా రాష్ట్ర ప్రజల సేవలో 5వ ఏడాది ప్రారంభం పేరిట శుక్రవారం రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్‌బుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలకు 15 శాతం మాత్రమే సేవలు అందించాలని.. ఇంకా చేయాల్సింది కూడా ఎంతో ఉన్నప్పటికీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అనుభవం, ముందుచూపు ఉన్న నాయకుడు అని తెలిపారు.

కేసీఆర్‌ను చూసి చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. అలాగే రాజ్‌భవన్, ప్రగతిభవన్‌కు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే సచివాలయానికి వెళ్లానని అన్నారు. ఇక తెలంగాణలో నేను ప్రజలను కలిస్తే రాజకీయం చేస్తున్నానంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే పుదుచ్చేరిలో ప్రతినెల 15వ తేదీన అక్కడి ప్రజలను కలుస్తున్నానని.. ఆ ప్రాంతంలో అధికారులు తనకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారమయ్యే రాజకీయ విమర్శలను తాను పట్టించుకోనని చెప్పారు. మరోవైపు తాను ప్రభుత్వంతో పోరాడటం లేదని.. మా మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. నా వద్దకు ఏ బిల్లుపై కూడా అలా గుడ్డిగా సంతకం చేయలేనని పేర్కొన్నారు. ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అలాగే కొన్ని బిల్లుల్లో లోపాలు ఉన్నాయనే వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపిచానని.. ఆర్టీసీ బిల్లు విషయంలో కూడా అనవసరంగా రాద్ధాంతం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే కార్మికుల లబ్ధికోసమే తాను కొన్ని ప్రతిపాదనలు చేశానని.. అది గురువారం రోజన మళ్లీ నా వద్దకు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం ఇద్దరి పేర్లను ప్రతిపాదించిందని.. గవర్నర్ కోటా రాజకీయపరమైనదని కాదని అన్నారు. ఇది సేవ, సాంస్కృతిక తదితర రంగాలు నిర్దేశించిందని అన్నారు. అలాగే ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రాకపోవడం సరైంది కాదని.. వైద్య కళాశాలల విషయంలో కూడా కొంత వివాదం ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ఇవ్వలేదని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రగతి ఫలాలు అందడం లేదని.. వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయని.. పారిశుద్ధ్యం మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి