Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాష్ట్రమంతటా బస్సు యాత్రలకు ప్లాన్
కాషాయ పార్టీ క్యాడర్ లో జోష్ నింపడానికి ప్రణాళికలు రూపొందించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ లు ప్రకాశ్ జవదేవకర్, సునీల్ బన్సాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17న హైదరాబాద్ విమోచన వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కాషాయ పార్టీ క్యాడర్ లో జోష్ నింపడానికి ప్రణాళికలు రూపొందించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ లు ప్రకాశ్ జవదేవకర్, సునీల్ బన్సాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపురావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 17న హైదరాబాద్ విమోచన వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో తెలంగాణ మూడు వైపుల నుంచి భారీ రథయాత్రలకు ప్లాన్ చేశారు. బాసర నుంచి హైదరాబాద్ వరకు ఒక ముఖ్య నేత నేతృత్వంలో యాత్ర.. సోమశిల నుంచి హైదరాబాద్ వరకు మరో ముఖ్య నేత ఆధ్వర్యంలో యాత్ర.. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు ఇంకో ముఖ్య నేత లీడ్ చేస్తూ యాత్ర నిర్వహించనున్నారు. 19 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర యాత్రలు సాగనున్నాయి. క్యాడర్ లో జోష్ నింపడమే లక్ష్యంగా బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎవరు ? ఎక్కడ నుంచి ? బస్సు యాత్రలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ చెరో వైపు నుంచి యాత్ర చేయడం కన్ఫర్మ్ అయ్యింది. మూడో వైపు నుంచి యాత్ర ఎవరు చేయాలనే దానిపై సందిగ్దత నెలకొంది. బండి సంజయ్, డీకే అరుణ ఇద్దరిలో ఎవరితో బస్సు యాత్ర చేయించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఉత్తర, దక్షిణ ధృవాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని మండల స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవలే ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించి క్షేత్రస్థాయి రిపోర్ట్ ను అధిష్టానానికి అందించారు. వారు ఇచ్చిన రిపోర్ట్ లపై సమావేశంలో చర్చించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న నెగటివ్ విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. సనాతన ధర్మంపై తమిళనాడు ఉదయ్ నిధి వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల13న ఉదయం 11 గంటల నుంచి, 14 తేదీ ఉదయం వరకు నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై 24 గంటల పాటు నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15న సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 17వ తేదీన ఉదయం అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాతీయ పతాకం ఎగురవేయాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యాక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ కారణాలతో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందన్ తదితరులు సమావేశానికి హాజరుకాలేదు. మొత్తంగా కమలనాథుల ప్రణాళికలు ఘనంగానే ఉన్నా.. ఏ మేరకు కార్యక్షేత్రంలో అమలు చేస్తారో చూడాలి.
బీజేపీ నేతల సమావేశం
నేడు హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నాను.
ఇందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీ స్థితిగతులు, కార్యక్రమాల నిర్వహణ మీద చర్చిండం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి శ్రీ ప్రకాష్ జవదేకర్ (@PrakashJavdekar) గారు, జాతీయ బీజేపీ… pic.twitter.com/hGMoeF2q3U
— G Kishan Reddy (@kishanreddybjp) September 8, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..