Hyderabad: హైదరాబాద్ నాలాలో పడి బాలుడు మృతి ఘటనలో బయటపడ్డ వాస్తవాలు..!

Hyderabad: హైదరాబాద్ నాలాలో పడి బాలుడు మృతి ఘటనలో బయటపడ్డ వాస్తవాలు..!

Anil kumar poka

|

Updated on: Sep 08, 2023 | 8:38 PM

ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలుడు.. తిరిగి ఇంటికి రాలేదు. పక్కనే ఉన్న షాప్‌కు వెళ్లిన గారాలపట్టి.. విగతజీవిగా తేలింది. అటు.. పనికి వెళ్లిన ఆ ఇంటి పెద్ద దిక్కు.. మళ్లీ ఇంటికి రాలేదు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఎంతో మంది జీవితాలు జల సమాధి అయిపోయాయి. హైదరాబాద్‌లో ఓపెన్‌ నాలాలు ఉసురు తీస్తున్నాయి. నాలుగేళ్ల బాలుడ్ని నాలా మింగేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలుడు.. తిరిగి ఇంటికి రాలేదు. పక్కనే ఉన్న షాప్‌కు వెళ్లిన గారాలపట్టి.. విగతజీవిగా తేలింది. అటు.. పనికి వెళ్లిన ఆ ఇంటి పెద్ద దిక్కు.. మళ్లీ ఇంటికి రాలేదు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఎంతో మంది జీవితాలు జల సమాధి అయిపోయాయి. హైదరాబాద్‌లో ఓపెన్‌ నాలాలు ఉసురు తీస్తున్నాయి. నాలుగేళ్ల బాలుడ్ని నాలా మింగేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాచుపల్లి ప్రగతినగర్ ఎన్నారై కాలనీ నాలాలో పడి గల్లంతై నాలుగేళ్ల బాలుడు మిథున్ మృతి చెందిన ఘటనలో అసలు నిజం వెలుగు చూసింది. మిథున్ మరణానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాలతో వరదనీరు రావడంతో.. దాన్ని నాలాలోకి పంపించిన ఇద్దరు వ్యక్తులు.. మళ్లీ మూత వేయకపోవడంతో ఈ విషాద ఘటన జరిగినట్లు వీడియో స్పష్టం చేస్తోంది. వారి నిర్లక్ష్యం వల్లే మిథున్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

సూర్యాపేటకు చెందిన సంతోష్ రెడ్డి ఐదేళ్ల క్రితం ప్రగతినగర్ వచ్చి ఎన్నారై కాలనీలో నివాసముంటూ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. సంతోష్ రెడ్డి రెండో కుమారుడు మిథున్.. ఇంటి నుంచి బయటకు వచ్చి.. అక్కడే మూత లేని మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయ్యాడు. బాలుడి కోసం స్థానికులు గాలించినా ఫలితం లేకపోయింది. తుర్క చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టగా మిథున్ మృతదేహం లభ్యమైంది. బాలుడు నాలాలో పడిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ వ్యక్తి వెనక వెళ్లిన బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, బాలుడు మరణించడానికి ఎన్నారై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాచ్‌మ్యాన్‌లు మ్యాన్ మూత తీసి మళ్లీ తిరిగి పెట్టకపోవడమే కారణమని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో స్పష్టమవుతోంది. వరదనీరు వెళ్లేందుకు నాలా మూత తీయించిన కాలనీ ప్రెసిడెంట్.. ఆ తర్వాత మూసివేయకుండా వదిలేశారు. దీంతో బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు, నెటిజన్లు సదరు ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..