Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: త్వరలోనే నిశ్చితార్థం.. స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు..

Andhra Pradesh: సెలూన్ షాప్ నిర్వహిస్తూ తల్లిని పోషిస్తున్నాడు.  అతడికి మంచి సంబంధం కుదరడంతో.. పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారం పది రోజుల్లో నిశ్చితార్థం. అందరూ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. అంతలోనే కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. స్నేహితుడి పెళ్లి కోసం వెళ్లిన సిద్ధూ తిరిగి రాని లోకాలు వెళ్లిపోయాడు. దీంతో ఆ తల్లి కన్నీటి పర్యంతం అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Andhra Pradesh: త్వరలోనే నిశ్చితార్థం.. స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు..
Siddu
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 09, 2023 | 2:15 PM

విశాఖపట్నం, సెప్టెంబర్09:  విశాఖ ఆరిలోవకు చెందిన శివ ప్రసాద్ అలియాస్ సిద్ధూ కు 22 ఏళ్ళు. తండ్రి లేడు.. ముగ్గురు అక్కలకు వివాహ మైంది. తల్లితో కలిసి నివసిస్తున్నాడు.. సెలూన్ షాప్ నిర్వహిస్తూ తల్లిని పోషిస్తున్నాడు.  అతడికి మంచి సంబంధం కుదరడంతో.. పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారం పది రోజుల్లో నిశ్చితార్థం. అందరూ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. అంతలోనే కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. స్నేహితుడి పెళ్లి కోసం వెళ్లిన సిద్ధూ తిరిగి రాని లోకాలు వెళ్లిపోయాడు. దీంతో ఆ తల్లి కన్నీటి పర్యంతం అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

– శివ ప్రసాద్ అలియాస్ సిద్ధూ తన స్నేహితుడి వివాహం వేడుకల కోసం బయలుదేరాడు. పెందుర్తిలో వివాహ వేడుకలు పూర్తయ్యక తిరుగు ప్రయాణమయ్యాడు. అర్ధరాత్రి దాటాక ఇంటికి బయలుదేరాడు. ఎందుకు నుంచి సింహాచలం వచ్చేసరికి అక్కడ మణికంఠమే మరో యువకుడు లిఫ్ట్ అడిగాడు. బైక్పై అతని ఎక్కించుకొని అక్కడ నుంచి బయలుదేరాడు. బి ఆర్ టి ఎస్ రోడ్ లో వస్తుండగా.. ఓ క్వారీ లారీ రోడ్డు వైపు నుంచి ఆరిలో కాలనీ వైపు మళ్లుతోంది. వస్తూ వస్తూ అదుపు చేయలేక అలారీని ఢీకొట్టింది శివప్రసాద్ బైక్. తీవ్ర గాయాలపాలై శివప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. బైక్ వెనక కూర్చున్న మణికంఠ గాయాలపాలనతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

– తండ్రి చనిపోయాక  ఆ ఇంటికి పెద్ద దక్కుగా నిలిచిన శివప్రసాద్.. ముగ్గురు అక్కలకు పెళ్లిళ్లు కావడంతో నిశ్చితార్థం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదనికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగా నొక్క కొడుకు.. ఇలా రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో వైపు అనకాపల్లి జిల్లాలో ఓ తాగుబోతు భర్త భార్యను గొంతునులిమి అతిదారుణంగా చంపేసిన ఘటన చోటు చేసుకుంది. తాగుడు బానిసైన వ్యక్తి డబ్బుల కోసం తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇంట్లో ఉన్నకాడికి పట్టుకుపోయి పీకల దాకా తాగేసేవాడు. అలా తాగొచ్చి రోజూ భార్య పిల్లల్ని కొడుతూ , తిడుతూ తీవ్రంగా వేధించేవాడు. ఈ క్రమంలో భార్య పేరిట ఉన్న భూమిని అమ్మేందుకు ప్రయత్నించాడు. అందుకు భార్య నిరాకరించటంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. కోపంతో భార్య గొంతునులిమి ఊపిరాడకుండా చేసి ఆమెను చంపేశాడు. విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..