Nara Bhuvaneshwari: నా బాధ చెప్పుకోవడానికే అమ్మవారి దగ్గరకు వచ్చాను.. చంద్రబాబు అరెస్టుపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..
Chandrababu Naidu Arrest: ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు రాజకీయంగా దుమారం రేపింది. నంద్యాలలో అర్ధరాత్రి నుంచి జరిగిన హైడ్రామా అనంతరం చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకుంది. నంద్యాల ఆర్‌కే ఫంక్షన్ హాల్ దగ్గర బాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయన్ను ఏ37గా చేర్చారు.
Chandrababu Naidu Arrest: ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు రాజకీయంగా దుమారం రేపింది. నంద్యాలలో అర్ధరాత్రి నుంచి జరిగిన హైడ్రామా అనంతరం చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకుంది. నంద్యాల ఆర్‌కే ఫంక్షన్ హాల్ దగ్గర బాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆయన్ను ఏ37గా చేర్చారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసు వివరాలను తనకు ఇవ్వాలని కోరారు చంద్రబాబు. దర్యాప్తు అధికారి లేకుండా తనను ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు చంద్రబాబు. తన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఆవేదన చెందారు. FIR నమోదు చేయకుండా నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉంటాయని చెప్పారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన చంద్రబాబుకు..అరెస్టుకు సంబంధించిన పేపర్లను అందజేశారు. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును వైద్య పరీక్షల అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడకు తరలించిన అనంతరం సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ప్రక్రియ అంతా సాయంత్రానికి పూర్తి అవుతుందని CID చీఫ్ వెల్లడించారు.
చంద్రబాబుకు ప్రతిఒక్కరూ మద్దతివ్వాలి…
చంద్రబాబు అరెస్టు అనంతరం ఆయన సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి, ఆమె సోదరుడు రామకృష్ణ.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి వేదపండితులు అశీర్వచనం అందించారు. అనంతరం నారా భువనేశ్వరీ మీడియాతో మాట్లాడారు. బాధలు చెప్పుకోవడానికి దుర్గమ్మను దర్శించాను.. చంద్రబాబును రక్షించాలని కోరుకున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నారు.. ఆయన పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలంటూ భువనేశ్వరి కోరారు. ‘‘ఒక బిడ్డకు మనసు బాలేనప్పుడు తల్లిదండ్రులు వద్దకు వెళతారు.. అందుకే నా బాధ చెప్పుకోవడానికే అమ్మవారి దగ్గరకు వచ్చాను.. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నా.. చంద్రబాబు పోరాటం ప్రజల స్వేచ్చకోసం.. చేయి చేయి కలిపి ప్రజలంతా ఏకమవ్వాలి.. మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కు’’.. అంటూ భువనేశ్వరి పేర్కొన్నారు.
వీడియో..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. తమ కుటుంబానికి అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాత్రికి రాత్రి చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయం.. అంతా మోసం.. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రమిస్తున్నారు.. ఏపీని వదిలేసి ముఖ్యమంత్రి విదేశాలకు తిరుగుతున్నారు.. అది మన దౌర్భాగ్యం అంటూ పేర్కొన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలుపుదాం అంటూ రామకృష్ణ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం