Rain Alert: వాన.. వస్తది.. వరద వస్తది.. బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవన ద్రోణి.
చత్తీస్‌గడ్‌కు ఆనుకుని మధ్య ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల.. రెండ్రోజుల పాటు కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల చెదురుమదురు వానలుతో పాటు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రాయలసీమలో అక్కడక్కడా జల్లులు పడతాయి.
చత్తీస్‌గడ్‌కు ఆనుకుని మధ్య ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల.. రెండ్రోజుల పాటు కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల చెదురుమదురు వానలుతో పాటు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రాయలసీమలో అక్కడక్కడా జల్లులు పడతాయి. తీరం వెంబడి గంటలకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు..మరో మరో రెండ్రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ,అనకాపల్లి,అల్లూరి , పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..