Rocks Music: గంటలు మోగిస్తున్న రాళ్లు.. ఒక్కోరాయినుంచి ఒక్కోరకమైన ధ్వని.. వీడియో.

Rocks Music: గంటలు మోగిస్తున్న రాళ్లు.. ఒక్కోరాయినుంచి ఒక్కోరకమైన ధ్వని.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 09, 2023 | 5:39 PM

సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయని పెద్దలు చెప్పగా మనం విన్నాం. కానీ ఇక్కడ రాళ్లు కరగడంలేదు సరికదా.. తిరిగి సంగీతాన్ని పలికిస్తున్నాయి. అదేనండి వింత శబ్ధాలు చేస్తున్నాయి. అవి వినడానికి గుడి గంటలు మోగుతున్నట్టుగా ఉన్నాయి. ఈ విచిత్ర సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని జనగామ, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో సుమారు 90 కిలో మీటర్ల మేర డోలరైట్ శిలలు వ్యాపించి ఉన్నాయి.

సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయని పెద్దలు చెప్పగా మనం విన్నాం. కానీ ఇక్కడ రాళ్లు కరగడంలేదు సరికదా.. తిరిగి సంగీతాన్ని పలికిస్తున్నాయి. అదేనండి వింత శబ్ధాలు చేస్తున్నాయి. అవి వినడానికి గుడి గంటలు మోగుతున్నట్టుగా ఉన్నాయి. ఈ విచిత్ర సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని జనగామ, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో సుమారు 90 కిలో మీటర్ల మేర డోలరైట్ శిలలు వ్యాపించి ఉన్నాయి. బచ్చన్నపేట మండలంలో ఎవరో పేర్చినట్లు కనిపించే ఈ శిలలు కట్కూరు, వీ.ఎస్.ఆర్‌ నగర్‌లోనూ దర్శనమిస్తాయి. ఈ రాళ్లను తాకితే ఒక్కోచోట ఒక్కో రకమైన సౌండ్‌ వస్తుంది. ఓ రాయి గుళ్లో గంట కొట్టినట్లు టంగ్.. టంగ్ మని ప్రతిధ్వనిస్తే మరో రాయి ఇనుప రాడ్డుతో గంట కొట్టినట్లు ధ్వనిస్తుంది.. వడగండ్ల వాన పడ్డ సమయంలో ఈ రాగాల కొండ పరిసరాలన్నీ వింతైన ధ్వని తరంగాలతో అబ్బుర పరుస్తాయి. ఈ మ్యూజికల్ రాక్స్ ను స్థానికులు ఓ మహత్యంగా భావిస్తున్నారు. మనసు బాగలేకపోతే ఇక్కడికి వచ్చి బండరాళ్లు రాపిడిచేస్తే ఈ రాళ్లు పలికేరాగాలు రోగాలను కూడా నయం చేస్తాయని స్థానికులు నమ్ముతారు. ఈ వింతైన రాగాల కొండ రహస్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసిన మైనింగ్ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా గుట్టను మాయం చేస్తున్నారు. ఈ రాతి ఖండాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే చరిత్ర పరిశోధకుడు ఈ రాతి కొండ రహస్యాన్ని ఛేదించిందేంకు పరిశోధనలు చేస్తున్నారు. వీటిని డైక్స్, అగ్ని శిలలు, డోలరైట్ శిలలని అంటారు. వీటిని శాస్త్రీయంగా మాగ్మాటిక్ డైక్స్, అవక్షేపాల శిలాద్రవం అంటారు.. బలహీనంగా ఉన్న భూమి పొరల్లో నుండి ఉబికివచ్చి చల్లబడినప్పుడు ఇలాంటి మాగ్మాటిక్ డైక్స్ ఏర్పడతాయని చెబుతున్నారు. ఇవి ఆర్కియాన్ కాలానికి చెందిన డైక్స్ గా భావిస్తున్నారు. ఇవి ఏర్పడి లక్షల సంవత్సరాలు గడిచి వుంటుందని అంటున్నారు. ఈ అద్భుతమైన రాళ్లధ్వనులు వినాలంటే వరంగల్‌ నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..