YouTuber Ravi Prabhu: చదువు, ఉద్యోగం మానుకోవద్దు.. యూట్యూబర్లకు సలహా.

YouTuber Ravi Prabhu: చదువు, ఉద్యోగం మానుకోవద్దు.. యూట్యూబర్లకు సలహా.

Anil kumar poka

|

Updated on: Sep 09, 2023 | 6:18 PM

ప్రపంచంలో 193 దేశాలను చుట్టేసారు తెలుగు యూట్యూబర్‌ రవి ప్రభు. వెయ్యికిపైగా విమానాల్లో 48 లక్షల ఎయిర్‌ కిలోమీటర్లు ప్రయాణించారు. సుమారు ఆరువేల హోటళ్లలో బస చేశారు. మిగిలిన రెండు దేశాలైన లిబియా, వెనిజుయెలా పర్యటనలు/Volumes/Digital Editing/FILE_SHORTS/video efx/video efx/LL.mp4 త్వరలో పూర్తి చేయబోతున్నారు. తన సక్సెస్‌కు కారణమేంటనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.

ప్రపంచంలో 193 దేశాలను చుట్టేసారు తెలుగు యూట్యూబర్‌ రవి ప్రభు. వెయ్యికిపైగా విమానాల్లో 48 లక్షల ఎయిర్‌ కిలోమీటర్లు ప్రయాణించారు. సుమారు ఆరువేల హోటళ్లలో బస చేశారు. మిగిలిన రెండు దేశాలైన లిబియా, వెనిజుయెలా పర్యటనలు/Volumes/Digital Editing/FILE_SHORTS/video efx/video efx/LL.mp4 త్వరలో పూర్తి చేయబోతున్నారు. తన సక్సెస్‌కు కారణమేంటనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. రవి ప్రభు సొంతూరు విశాఖపట్నం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ చదివారు. తండ్రి బ్యాంకు ఉద్యోగి, తల్లి ఉపాధ్యాయురాలు. పదేళ్ల వయసులో భూటాన్‌ విహారయాత్రకు వెళ్లగా అక్కడే ట్రావెలర్‌గా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వెళ్లిన రెండో దేశం అమెరికా. అది కూడా ఉన్నత చదువుల కోసమే. ప్రస్తుతం అక్కడే కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తన జీతంలో ఒక వంతు ప్రపంచ పర్యటనకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంకో విషయం ఏంటంటే.. దాదాపు 800 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో మొత్తం 195 దేశాలు తిరిగిన వారు వెయ్యిలోపే ఉంటారని భారత్‌ నుంచి నలుగురైదుగురు ఉండగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి తనొక్కడినే కావడం గర్వంగా ఉందని అన్నారు. అయిదారేళ్ల క్రితం వరకు యూట్యూబ్‌ విప్లవం ఇంతగా లేదనీ నేడు యూట్యూబర్లకు ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించిందంటే దానికున్న ప్రాధాన్యత అర్థమవుతుందని అన్నారు. ఇది ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం. అందుకే చదువు, ఉద్యోగం కొనసాగిస్తూనే యూట్యూబర్లుగా కొనసాగే ప్రయత్నం చేయాలి అని రవిప్రభు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..