ఆ MLA కు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం.. ఆ లడ్డూలు ఏం చేశారో తెలుసా…?

ఎక్కడైనా ప్రజల కోరికమేరకు కొత్త నిర్మాణాలు చేపడితే సన్మానాలు చేస్తారు. కానీ కూల్చితే సన్మానాలు చేయడం..తులాభారం వేసి రుణం తీర్చు కోవడం ఎక్కడైనా చూశారా..? హనుమకొండలో స్థానిక ఎమ్మెల్యేకు వ్యాపారులు నిలువెత్తు లడ్డూలు, పండ్లతో తులాభారం వేసి వినూత్న రీతిలో రుణం తీర్చుకున్నారు.. అసలేం జరిగింది..? ఆ MLA ఏం కూల్చాడు..?ఆ వ్యాపారులు ఎందుకలా నిలువెత్తు తులాభారంతో రుణం తీర్చుకున్నారు..? తెలుసుకోవాలంటే అసలు కథ తెలియాలి.....

ఆ MLA కు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం.. ఆ లడ్డూలు ఏం చేశారో తెలుసా...?
Mla Tulabharam
Follow us
G Peddeesh Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 14, 2024 | 10:23 AM

గత కొద్ది రోజులుగా నిత్యం జనంలో చర్చగా నిలుస్తున్నారు వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి. తాజాగా స్థానిక ప్రజలు ప్రేమతో ఆయనకు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రజల అభీష్టం మేరకు ఓ పనిచేసి ఇలా వినూత్న రీతిలో వాళ్ల చేత సత్కారాన్ని పొందాడు. హనుమకొండకు చెందిన కొందరు వ్యాపారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డిని లడ్డూలతో నిలువెత్తు తులాభారం నిర్వహించారు.. అంతేకాదు,పండ్ల వ్యాపారులంతా కలిసి ఎమ్మెల్యేకు నిలువెత్తు యాపిల్స్‌తో 70 కేజీల తులాభారం వేసి రుణం తీర్చుకున్నారు. ఎమ్మెల్యేకు లడ్డూలతో తులాభారం వేయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.. కానీ ఆ వ్యాపారులు ఎందుకిలా తులాభారం వేసి రుణం తీర్చుకున్నారో తెలిసిన తర్వాత వారంతా శబ్భాష్ అని ప్రశంసించారు.

హనుమకొండ చౌరస్తాలో 15 ఏళ్లకు పైగా వ్యాపారులు సతమతమవుతున్న ఓ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు.. సిపి రెడ్డి కాంప్లెక్స్ & జీవన్ లాల్ కాంప్లెక్స్ ను కలుపుతూ ఒక పుటోవర్ బ్రిడ్జి ఉండేది..ఆ ఫుటోవర్ బ్రిడ్జి కేవలం వ్యాపార ప్రకటనలకు మాత్రమే ఉపయోగపడేది.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.. చీకటి పడితేచాలు తాగుబోతులకు కేరాఫ్ గా మారింది.. ఆ ఫుటోవర్ బ్రిడ్జి వల్ల రెండు కాంప్లెక్స్‌లకు చెందిన వ్యాపారులతో పాటు, ప్రధాన రహదారి పై చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆ బ్రిడ్జి తీసేయండని ఎన్నోసార్లు వ్యాపారులు మొరపెట్టుకున్నారు. కానీ ఎవరు స్పందించలేదు..

నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యాపారులు ఆయన వద్దకు వెళ్లి ఈ సమస్య విన్నవించారు.. ఈ క్రమంలో స్వయంగా ఆయనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు వచ్చి ఇక్కడున్న సమస్యను ప్రత్యక్షంగా చూశారు.. వెంటనే స్పందించిన ఆయన మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆ ఫుటోవర్ బ్రిడ్జిని తొలగించేశారు..

ఇవి కూడా చదవండి

ఈ బ్రిడ్జి తొలగించడంతో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పడింది.. వ్యాపారుల సమస్యకు శాశ్వత విముక్తి లభించింది.. 15 ఏళ్ల నుండి సతమతమవుతున్న సమస్య ఒక్కరోజుతో తొలగిపోవడంతో వ్యాపారులు ఆనందంతో ఉప్పొంగి పోయారు.. తమ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఏదో విధంగా రుణం తీర్చుకోవాలని వారంతా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..

వీడియో ఇక్కడ చూడండి..

సి.పి రెడ్డి కాంప్లెక్స్ లోనే ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యాపారులు ఆయనపై అమితమైన అభిమానాన్ని చాటుకున్నారు.. నిలువెత్తు లడ్డూలతో తులాభారం వేశారు.. మరికొందరు వ్యాపారులు నిలువెత్తు ఆపిల్స్ తో తులాభారం వేసి రుణం తీర్చుకున్నారు.. ఎమ్మెల్యే 70 కేజీలు తూగగా ఆయన ఎత్తు లడ్డూలు, ఆపిల్స్ తూకంవేసి అక్కడున్న ప్రజలందరికీ పంచారు…

హనుమకొండలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం జనంలో చర్చగా మారింది.. వారి అభిమానాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపైన ఎమ్మెల్యే కూడా సమస్య సృష్టిస్తే శత్రువుతారు.. పరిష్కరిస్తే ప్రజల చేత ప్రశంసలు పొందుతారని అన్నారు.. వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంఎల్ఏ.. ఇలాంటి అభిమానాన్ని రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు.. కూల్చడమైనా కట్టడమైనా ప్రజల అభీష్టం మేరకు పనిచేస్తే నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..
మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? లివర్ డేంజర్‌లో..
బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు
బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గనుందోచ్‌.. వచ్చే జూన్‌ నుంచే అమలు
క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం
క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం
పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!
పీరియడ్స్‌లో కడుపునొప్పి బాగా వస్తోందా.. ఇవే కారణాలు కావచ్చు!
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. పోలీసులు మనోజ్‌కు ఏం చెప్పారంటే..?
రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
రూ.200 నోట్లు రద్దు అవుతున్నాయా..? కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ!
ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!
ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్
పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో BRS పిటిషన్స్
9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?
9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు.. 6 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూపులు?
CA ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ప్రిపరేషన్ టిప్స్ ఇవే
CA ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ప్రిపరేషన్ టిప్స్ ఇవే
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..