AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సినీ ఫక్కీలో దర్జాగా దోపిడిలు.. ఖరీదైన కారులో వచ్చి.. క్లాస్‌గా దోసుకుపోతున్న దొంగలు..

దోపిడీ దొంగలు వరంగల్ ప్రజలకు- పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.. అపార్ట్‌మెంట్సే వారి టార్గెట్.. ఖరీదైన కారులో క్లాస్ గా వచ్చి లూటీలకు పాల్పడుతున్నారు.. ఈ దోపిడీలు పట్టపగలే జరగడం విశేషం. వరంగల్ - హనుమకొండ పట్టణాల్లో లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అపార్ట్‌మెంట్లలో అచ్చం సినీ ఫక్కీలో దోపిడీలకు పాల్పడ్డారు. అడ్డదారిలు కాదు..

Telangana: సినీ ఫక్కీలో దర్జాగా దోపిడిలు.. ఖరీదైన కారులో వచ్చి.. క్లాస్‌గా దోసుకుపోతున్న దొంగలు..
Robbery Cctv Footage
G Peddeesh Kumar
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 06, 2023 | 8:34 AM

Share

Warangal, September 06: దోపిడీ దొంగలు వరంగల్ ప్రజలకు- పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.. అపార్ట్‌మెంట్సే వారి టార్గెట్.. ఖరీదైన కారులో క్లాస్ గా వచ్చి లూటీలకు పాల్పడుతున్నారు.. ఈ దోపిడీలు పట్టపగలే జరగడం విశేషం. వరంగల్ – హనుమకొండ పట్టణాల్లో లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అపార్ట్‌మెంట్లలో అచ్చం సినీ ఫక్కీలో దోపిడీలకు పాల్పడ్డారు. అడ్డదారిలు కాదు.. నేరుగా కారులో వచ్చి క్లాస్ గా దోసుకుపోయారు. అపార్ట్‌మెంట్లలో తాళాలు పగలగొట్టి లూటిలో పాల్పడ్డారు. ఇదంతా పోలీస్ అధికారులు క్రైమ్ మీటింగ్‌లో వున్న సమయంలో పట్టపగలే జరుగడం విశేషం.

వరంగల్ సిటీలో పట్టపగలు జరిగిన ఈ లూటీలు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ వాల్సిందే. క్లాస్ గా ఖరీదైన కార్లు వచ్చిన దోపిడి దొంగలు దర్జాగా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. వారికి ఏదో గిఫ్ట్ ఆఫర్ వచ్చిందని వాచ్ మెన్‌ను నమ్మించి లోపలికి వెళ్లారు. తాళాలు వేసి వెళ్ళిన ఫ్లాట్లను సెలెక్ట్ చేసుకుని మరి తాళాలు పగలగొట్టి ఆ ఇళ్లలోని బంగారం, విలువైన వస్తువులు నగదు లూటీలకు పాల్పడ్డారు.

ఒకటో రెండో కాదు.. ఏకంగా ఆరు ఆపార్ట్‌మెంట్లలో దోపిడీలు జరిగాయి. సుమారు 170 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, భారీ ఎత్తున నగదు విలువైన వస్తువులు, దోపిడీకి గురైనట్లుగా గుర్తించారు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ లోని గాయత్రి రెసిడెన్సీ, వద్దిరాజు రెసిడెన్సీలో చోరీ జరిగింది. హనుమకొండ నయీమ్ నగర్ ప్రాంతంలోని కల్లెడ అపార్ట్మెంట్, లహరి అపార్ట్ మెంట్, మారుతి అపార్ట్ మెంట్ తో పాటు మరో అపార్ట్ మెంట్ లో దోపిడిలు జరిగాయి. ఈ ముఠా అచ్చం సినీ ఫక్కీలో దోపిడిలకు పాల్పడ్డారు.. పట్టుకోండి చూద్దాం అన్నట్లు పోలీసులకు సవాల్ విసిరారు. ఈ లూటీ జరిగిన తీరుచూసి పోలీసులే షాక్ అయ్యారు. నిందితుల ఉపయోగించిన కారు ఆధారంగా ఈ ముఠా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎక్స్‌పర్ట్స్‌గా భావిస్తున్నారు.

పోలీస్ కమీషనర్ ఏ వీ రంగనాథ్ దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగలోకి దింపారు.. ఇప్పటివరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు.. వరంగల్ కు వచ్చి వెళ్లే అన్ని రూట్లలో సీసీ కెమెరా ఫుటేజ్, టోల్ గేట్ లు పరిశీలిస్తున్నారు.. వారు ఏ రూట్లో వచ్చారు..? ఎటు వెళ్లారని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్