Warangal Mayor: గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..?

గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇప్పుడు ఏ పార్టీ..? బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..? లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పర్యటనకు ఆమె డుమ్మా కొట్టారు. దీంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరంగా ఉండటం వెనుక అసలు కారణం ఏమిటి..?

Warangal Mayor: గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..?
Revanth Reddy Gudu Sudharani, Ponguleti
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 24, 2024 | 2:15 PM

గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇప్పుడు ఏ పార్టీ..? బీఆర్ఎస్‌లో ఉన్నట్టా..? లేనట్లా..? లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పర్యటనకు ఆమె డుమ్మా కొట్టారు. దీంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు సుధారాణి దూరంగా ఉండటం వెనుక అసలు కారణం ఏమిటి..? బీఆర్ఎస్ ఫ్లెక్సీలలో ఆమె ఫోటోలు వద్దునుకొనే తొలగించారా..? ఇదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనతో మేయర్ గుండు సుధారాణి పొలిటికల్ కెరీర్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది.. వరంగల్ తూర్పు నియోజక వర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి మేయర్ గుండు సుధారాణి డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

వరంగల్ జిల్లాలోనే వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజక వర్గాల బీఆర్ఎస్ మీటింగ్ మంగళవారం జరిగింది.. ఈ సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ సమావేశాల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మేయర్ సుధారాణి ఫోటో ఎక్కడ కనిపించలేదు. ఇంతకు మేయర్ సుధారాణి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా?.. లేనట్టా.. అని జిల్లాలో చర్చ జరుగుతుంది.

బీఆర్ఎస్ వర్గాలలో కూడా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కుమారుడుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ గుండు సుధారాణి కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుండు సుధారాణిని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందనే చర్చ జరుగుతుంది. త్వరలోనే పార్టీ మారుతారన్న వార్తలు వెలువడ్డాయి. దీంతో బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆమె దూరం అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే వరంగల్ మహానగరంలో రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా