Telangana: మాటలకందని విషాదం.. మరో పసి ప్రాణాన్ని బలి తీసుకున్న వీధి కుక్కలు..
Warangal Dog Attack: తెలంగాణలో వీధి కుక్కల దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి.
Warangal Dog Attack: తెలంగాణలో వీధి కుక్కల దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిపై దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి. వరంగల్ నగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే.. మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాజాగా.. వీధి కుక్కలు మరో పసి ప్రాణాన్ని బలి తీసుకోవడం ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది.. జూన్ 17న ఇంట్లోకి చొరబడిన వీధి కుక్కలు.. ఆడుకుంటున్న పసివాడిపైన దాడిచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
వరంగల్ బట్టుపల్లి కొత్తపల్లి గ్రామంలో 25 రోజుల క్రితం డేవిడ్ రాజ్ అనే 18 నెలల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వీధి కుక్కవల దాడిలో డేవిడ్ రాజ్ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు బాలుడిని హన్మకొండలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో డేవిడ్ రాజ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందాడు.. రాజు మృతితో అతని తల్లీదండ్రులు బోరున విలపిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో రికార్డు చేసిన బాలుడి వీడియోలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..