AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCL: ఇప్పుడు రూ. 10 వేలకు 500 షేర్లు.. కట్ చేస్తే.. రెండేళ్లలో ఎంతొస్తుందో తెలిస్తే బిత్తరపోతారు

స్టాక్ మార్కెట్‌లో ప్రతీ రోజూ అనేక స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. అందులో నుంచి ఓ స్టాక్ ఇప్పుడు తెలుసుకుందామా.. దీనికి స్టాక్ స్ప్లిట్ అండ్ డివిడెండ్ కూడా వస్తుంది. ఫ్యూచర్‌కు బెస్ట్ స్టాక్ ఇది. మరి ఆ స్టాక్ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

BCCL: ఇప్పుడు రూ. 10 వేలకు 500 షేర్లు.. కట్ చేస్తే.. రెండేళ్లలో ఎంతొస్తుందో తెలిస్తే బిత్తరపోతారు
Bccl
Ravi Kiran
|

Updated on: Feb 09, 2026 | 6:32 PM

Share

భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(BCCL) షేర్లు.. పేరెంట్ కంపెనీ కోల్ ఇండియా(Coal India) ఆధారంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలోకి ఎంట్రీ ఇచ్చాయి. రూ. 21తో అరంగేట్రం ఈ షేర్ ప్రస్తుతం రూ. 37 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ తరుణంలో వీటి పరిస్థితిపై బిజినెస్ నిపుణులు ఏం అన్నారంటే.? ఇప్పటికే ఈ షేర్లు కొనుగోలు చేసినవారు అలా హోల్డ్ చేసి పెట్టాలని.. మరిన్ని షేర్లు కొనవద్దని సూచించారు. కొత్తగా కొనేవారు మాత్రం ఇది పెట్టుబడికి మంచి అవకాశం అని.. మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్‌లను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. షేర్లకు అమ్మకాల ఒత్తిడి తప్పదని.. ప్రస్తుతం ఈ షేర్ పరిస్థితి కూడా అంతేనని అన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. భారత్ కోకింగ్ కోల్(BCCL) షేర్లు ప్రస్తుతం ట్రేడింగ్ స్థాయిలను పరిశీలిస్తే.. ఇప్పటికే BCCL షేర్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ఎలాంటి ఆలోచన పెట్టకుండా హోల్డ్ చేసి ఉండాలని సలహా ఇస్తున్నారు. ఈ స్థాయిలలో అదనంగా షేర్లను కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం అమ్మకాల ఒత్తిడి అని చెప్పుకొచ్చారు. అయితే, ఇంతవరకు BCCL షేర్లను కొనుగోలు చేయనివారికి.. ఇది మంచి అవకాశం అని చెప్పారు. మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా “పెయిన్ పాయింట్”లో ఉన్నప్పుడు, ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీ స్టాక్‌లను పరిగణనలోకి తీసుకోవడం తెలివైన నిర్ణయమని నిపుణులు అభిప్రాయపడ్డారు. BCCL ఒక ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీ స్టాక్ కాబట్టి, ప్రస్తుత స్థాయిలో కొనుగోలుకు ఇది అనుకూలంగా ఉండవచ్చని సూచించారు. ఇది ప్రస్తుతం ఉన్న స్థితి కంటే కొంచెం తక్కువ స్థాయిలో కనిపించినప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది మంచిదని భావిస్తున్నారు. అటు కోల్ ఇండియా పేరెంట్ కంపెనీ కావడం, అలాగే స్టాక్ స్ప్లిట్ భవిష్యత్తులో ఉండటంతో.. డివిడెండ్, ఫ్రీ షేర్స్ వస్తాయని సూచిస్తున్నారు.