AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని బిట్‌కాయిన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే.. చేజేతులా..

డబ్బు ఎంతటి దారుణానికి అయినా మనిషిని లాక్కెళ్తుందని అనడానికి మరో ఉదాహరణ ఈ సంఘటన. అవసరం మేరకు డబ్బు సంపాదన మంచిదే.. కానీ అవసరానికి మించి ఆశపడి ధన వ్యామోహంలో పడిపోతే మాత్రం దాని నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు.

Hyderabad: నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని బిట్‌కాయిన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే.. చేజేతులా..
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 09, 2026 | 5:10 PM

Share

హైదరాబాద్‌లోని పాతబస్తీ పరిధిలోని మీర్ చౌక్ ప్రాంతంలో మొహమ్మద్ ఔన్ ఖాన్ అనే ఓ వ్యక్తి వారం క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ కుటుంబ సభ్యుల అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ఆత్మహత్యకు కారణం తెలుసుకుని కుటుంబ సభ్యులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్ద గండం తప్పిందని అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు భావించినా మొహమ్మద్ ఔన్ ఖాన్ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అదే క్రమంలో ఈ రోజు మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించి విషం తాగి ప్రాణాలు కోల్పోయాడు. క్రిప్టో కరెన్సీలో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మీర్ చౌక్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు బయటికి వచ్చాయి. మరణించిన మొహమ్మద్ ఔన్ ఖాన్ తన స్నేహితుడు జాన్‌కు క్రిప్టో కరెన్సీని బదిలీ చేశాడు. అయితే, జాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఔన్ ఖాన్, జాన్ చాలా ఏళ్లుగా స్నేహితులు కూడా. మొహమ్మద్ ఔన్ ఖాన్ ఆస్ట్రేలియాలో జాన్‌ను కలిసిన సమయంలో క్రిప్టో కరెన్సీని తన ఖాతాకు బదిలీ చేయమని జాన్ కోరాడు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో అతనికి రూ.1.5 కోట్ల భారతీయ కరెన్సీని ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఎప్పటి నుంచో వాళ్ల మధ్య స్నేహం అనే బంధం కారణంగా ఔన్ ఖాన్.. జాన్‌ను నమ్మాడు. ఏమీ ఆలోచించకుండా స్నేహితుడు అడిగిన విధంగానే చేశాడు. అయితే అక్కడే ఔన్ ఖాన్ తప్పు చేశాడు. క్రిప్టో కరెన్సీ అందుకున్న తర్వాత జాన్ ఆస్ట్రేలియాలో ఉన్న తన చిరునామాను మార్చుకున్నాడు. దీంతో ఔన్ ఖాన్ తన స్నేహితుడిని సంప్రదించే అవకాశం లేకుండా పోయింది. కొన్ని రోజుల ఎదురుచూపుల తర్వాత తాను మోసపోయానని ఔన్ ఖాన్ గ్రహించాడు. దాదాపు కోటిన్నర డబ్బులను నష్టపోయి నిరాశకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే మొదటిసారి కుటుంబ సభ్యుల అప్రమత్తతతో గండం నుంచి బయటపడినా.. కష్టపడి సంపాదించిన డబ్బు చేజేతులారా పోగొట్టుకున్నాననే బాధ ఔన్ ఖాన్‌ను చుట్టుముట్టింది. అదే ఆవేదనతో వారం తిరగకుండానే మరోసారి ఆత్మహత్యకు పూనుకుని చివరికి నిండు ప్రాణాన్ని బలి చేసుకున్నాడు. డబ్బు ఎంతటివారినైనా కష్టాలపాలు చేస్తుందని.. అలాంటి డబ్బుపై అధికంగా వ్యామోహం పెంచుకోకుండా ఉన్నంతలో బతుకుతూ సంతృప్తి చెందాలని ఈ సంఘటన మనకు చెబుతోంది.

Follow Us
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే