AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రుల’ గోల.. కొత్త చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి కామెంట్స్..!

తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు పెరిగిపోతున్నారా...? కర్ణాటక తరువాత గ్రాఫ్ పెరుగుతుండడంతో సీఎం విషయంలో వర్గాల వారిగా విడిపోతున్నారా...? ముందు గెలవండి తరువాత సీఎం గురించి ఆలోచించండి క్యాడర్ మొత్తుకున్న సీఎం పదవి కోసం ఇప్పుడే కత్తులు దువ్వుకుంటున్నారా...? తెలంగాణ కాంగ్రెస్ లో ఈ సీఎంల గోల ఏంటి..?

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రుల’ గోల.. కొత్త చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి కామెంట్స్..!
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 12, 2023 | 4:24 PM

Share

Telangana Congress: కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. ఇక ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం ఆశవాహులు సైతం పెరిగిపోతున్నారు..కర్ణాటక ఫార్ముల తెలంగాణలోనూ ఉపయోగిస్తే తమకు ఎక్కడ సీఎం పదవి దక్కదోనని వారికీ అనుకూలంగా ఉన్న వారిని మా సీఎం అంటూ ఎవరికీ వారు ప్రకటనలు చేసుకుంటున్నారు. గతంలో కలహాలు ఉన్న కాంగ్రెస్ లో కర్ణాటక తరువాత మార్పు వచ్చింది. నేతలంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు.

గతంలో రెడ్డీ సమాజిక వర్గ నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. అందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి లే సీఎం అవుతారని కూడా అందరూ భాచించేవారు. రెడ్డీ నేతలతో సీఎం అభ్యర్థుల ఆశవాహ లిస్ట్ సైతం భారీగానే ఉండేది..రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి పలువురు పేర్లు వినిపించేవి. ఇక కెసిఆర్ పై దళిత సీఎం విషయంలో ఎదురు దాడి చేసే కాంగ్రెస్ నేతలు ..తమ ప్రభుత్వం వస్తే దళితులకు పెద్ద పీట వేస్తామని చెప్పేవారు.. అందులో భాగంగా దళితులకు అవకాశం వస్తే సిఎల్పి నేత బట్టి విక్రమార్కకి అవకాశం ఇవ్వాలని కొంతమంది సీనియర్ నేతలు సైతం బట్టికి బహిరంగంగానే మద్దతు తెలిపారు.. వీటికి కౌంటర్ పాలిటిక్స్ గా రేవంత్ అనూహ్యంగా  ఎమ్మెల్యే సీతక్క పేరును తెరమీదకు తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్క సీఎం అవుతుందని ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు. ఒకవేళ దళితులకు సీఎం అవకాశం వస్తే మల్లు బట్టివిక్రమార్క పేరు చర్చకు వచ్చినప్పుడు.. గిరిజన సమాజిక వర్గానికి చెందిన సీతక్క పేరును కూడా పరిశీలించాలని రేవంత్ కొత్త చర్చకు తెరలేపినట్లు గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు సీఎం ఆశవాహులు పెరిగిపోతుందడం పట్ల సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనలేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన, తెచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఇప్పుడు వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టి దూసుకుపోతోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంపై దృష్టిపెట్టకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్న చర్చ సరికాదని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంపై పార్టీ నేతలు పూర్తిగా ఫోకస్ పెట్టాలని.. లేదంటే కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్న అంశం కేవలం చర్చకు మాత్రమే పరిమితం కావొచ్చని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..