BRS Party: బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని వినూత్న దీక్ష చేపట్టిన గులాబీ దళం..
అయ్యప్ప దీక్షను చూశాం.. హనుమాన్ దీక్షను పూనాం. తెలంగాణ తల్లి దీక్షను ఎక్కడైనా చూశారా..? ఇంతకీ ఆ వింత దీక్ష ఎందుకు ఎక్కడ చేపడుతున్నారో తెలుసా..? తెలంగాణ తల్లి దీక్ష తీసుకున్న వారి డ్రెస్ కోడ్ ఏంటో చూస్తే షాక్ అవుతారు. ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీ మీకోసమే.. చూసేయండి. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని, తమ అభిమాన నాయకుడు గెలవాలని కోరుకుంటూ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ తల్లిదీక్ష చేపట్టారు.
హనుమాన్ దీక్షను చూశాం. అయ్యప్ప దీక్షను ఆచరించాం. తెలంగాణ తల్లి దీక్షను ఎక్కడైనా చూశారా..? ఇంతకీ ఆ వింత దీక్ష ఎందుకు ఎక్కడ చేపడుతున్నారో తెలుసా..? తెలంగాణ తల్లి దీక్ష తీసుకున్న వారి డ్రెస్ కోడ్ ఏంటో చూస్తే షాక్ అవుతారు. ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీ మీకోసమే.. చూసేయండి. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని, తమ అభిమాన నాయకుడు గెలవాలని కోరుకుంటూ వరంగల్‌లో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ తల్లిదీక్ష ఆచరిస్తున్నారు. అచ్చం అయ్యప్ప దీక్ష తరహాలోనే పింక్ మాలలు ధరించి దీక్ష చేపడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ వినూత్న దీక్షను చేపట్టారు. 21 మంది తెలంగాణ తల్లిదీక్ష పేరుతో దీనిని ఆచరిస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్, తెలంగాణ ఉద్యమకారుడు నీలం రాజ్ కిశోర్ నేతృత్వంలో ఈ వింత దీక్షను చేపట్టారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని.. వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ మరోసారి గెలువాలని కోరుతూ 28వ డివిజన్‌లో తెలంగాణ తల్లి మాలాధారణ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలోని గణపతి మండపంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. పూజారుల సమక్షంలో తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మలను పేర్చి దీక్షా హోమాన్ని నిర్వహించారు. దీక్ష నియమాల ప్రకారం గులాబీ రంగు వస్త్రాలు ధరించి, గులాబీ రంగు మాల మెడలో వేసుకున్నారు. సీఎం కేసిఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే వరకు తాము ఈ దీక్ష ఆచరిస్తమని తెలిపారు. వరంగల్ గులాబీ సైన్యం చేపట్టిన ఈ వింత దీక్ష ఇప్పుడు ఓరుగల్లులోనే కాకుండా యావత్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..