PM Modi in Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రధాని మోదీ.. సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక పూజలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోదీకి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ కొద్దిసేపు ఆలయంలో గడిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన మోదీకి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ కొద్దిసేపు ఆలయంలో గడిపారు. ఆ తర్వాత ఆలయ పండితుల నుంచి వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మోదీకి ప్రసాదం అందజేశారు.
రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే మోదీ శ్రీవారిని దర్శించుకొని అతిధిగృహం చేరుకున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు మోదీ,. ఆయన తిరుమలను సందర్శించడం ఇప్పుడు నాలుగోసారి.
తిరుమలలో మోదీ శ్రీవారి దర్శనం వీడియో చూడండి..
Om Namo Venkatesaya!
Some more glimpses from Tirumala. pic.twitter.com/WUaJ9cGMlH
— Narendra Modi (@narendramodi) November 27, 2023
ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. వీఐపీ అతిథి గృహాలను NSG టీమ్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అలాగే, ప్రధాని ప్రయాణించే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరికాసేపట్లో తిరుమల నుండి తిరుపతి ఎయిర్‌పోర్ట్ కు ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరుతారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ.. మహబూబాబాద్, కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..