Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..

Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..

Phani CH

|

Updated on: Nov 27, 2023 | 11:04 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా భావించే కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ముస్లిం మత పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి అనేకమంది ముస్లింలు ఇక్కడికి వచ్చి ఉరుసు ఉత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గా దేశంలోనే అత్యంత ప్రాచుర్యం చెందింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా భావించే కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ముస్లిం మత పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి అనేకమంది ముస్లింలు ఇక్కడికి వచ్చి ఉరుసు ఉత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గా దేశంలోనే అత్యంత ప్రాచుర్యం చెందింది. అమీన్‌పూర్‌ దర్గా దర్శనంతోనే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. దీంతో దేశం నలుమూలలనుంచి ముస్లింలు, ముస్లిమేతరులు కూడా ఉరుసు ఉత్సవాలకు పోటెత్తుతారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు అమీన్‌పూర్‌ దర్గాను దర్శించి మొక్కులుచెల్లించుకుంటారు. ఈ ఏడాది నవంబరు 25వ తారీకు నుంచి వచ్చే నెల ఒకటవ తారీకు వరకు ఉరుసు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గాను అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు

Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు