School Holidays: నేడు పాఠశాలలకు సెలవు.. డిసెంబర్‌లో మరో 9 రోజులు సెలవులు

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన గురునానక్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. నవంబర్ 27న గురునానక్ జయంతి నేపథ్యంలో ఒక్క తెలంగాణ రాష్ట్రలో మాత్రమేకాకుండా పలు రాష్ట్రాలలోని విద్యాసంస్థలకు కూడా 'సాధారణ సెలవులు' కింద నేడు సెలవు ప్రకటించారు..

School Holidays: నేడు పాఠశాలలకు సెలవు.. డిసెంబర్‌లో మరో 9 రోజులు సెలవులు
School Holidays
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2023 | 10:52 AM

హైదరాబాద్‌, నవంబర్ 27: ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన గురునానక్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. నవంబర్ 27న గురునానక్ జయంతి నేపథ్యంలో ఒక్క తెలంగాణ రాష్ట్రలో మాత్రమేకాకుండా పలు రాష్ట్రాలలోని విద్యాసంస్థలకు కూడా ‘సాధారణ సెలవులు’ కింద నేడు సెలవు ప్రకటించారు.

ఢిల్లీ, నోయిడాలోనూ పాఠశాలలకు సెలవు

గురునానక్ జయంతి సదర్భంగా సోమవారం ఢిల్లీ, నోయిడాలోని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. తిరిగి ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలు నవంబర్ 28వ తేదీ నుంచి యథాతథంగా ప్రారంభమవుతాయి. సోమవారం నాడు పాఠశాలలతో పాటు, బ్యాంకులు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సైతం గురునానక్ జయంతి 2023 సందర్భంగా సెలవు ప్రకటించారు. గత శుక్రవారం (నవంబర్ 24) కూడా గురు తేగ్ బహదూర్ షహీదీ దివస్ కారణంగా నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్‌లోని పాఠశాలలకు సెలవు ఇచ్చారు. శుక్రవారం నాడు ప్రీ-నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు సమాచారం.

గురునానక్ జయంతి

గురునానక్ జయంతి లేదా గురునానక్ దేవ్ జీ.. గురుపురబ్ నాడు జరుపుకుంటారు. ఈ రోజు సిక్కుల మొదటి సిక్కు గురువు గురునానక్ జన్మదినాన్ని జరుపుకుంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ సిక్కులు గురువుగా భావిస్తారు. ఇది సిక్కు మతం వారికి అత్యంత పవిత్రమైన పండుగ. గురునానక్ జయంతి సందర్భంగా పలు ఉత్తరాది రాష్ట్రాలతోపాటు హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌లో మరో 9 రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణలోని పాఠశాలలకు డిసెంబర్‌ నెలలో మరో 9 రోజులు సెలవులు రానున్నాయి. మొదటి ఏడు రోజులలో ఐదు ఆదివారాలు, మిగిలిన రెండు సెలవులు క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా డిసెంబర్ 25, 26 తేదీలలో సెలవులు రానున్నాయి. హైదరాబాద్‌లోని మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇక తెలంగాణలో నవంబర్ 29, 30 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారు. అందువల్లనే నవంబర్ 29, 30 తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!