Crime News: ఆమెకు అది మూడో పెళ్లి.. అతనికి రెండో పెళ్లి! భార్యపై అనుమానంతో..

భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. మొదటి పెళ్లి పెటాకులు కావడంతో ఆమెను వివాహం చేసుకున్నాడు అతను. ఇక ఆమెకు అతను మూడో భర్త. కొంతకాలం సవ్యంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత గొడవలు రాసాగాయి. ఈ క్రమంలో భార్య గొంతు నులిమి భర్త దారుణంగా చంపాడు. అనంతరం పోలీసుల ఎదుట తానే చంపినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన మైసూరులో శుక్రవారం (నవంబర్ 24) చోటు చేసుకుంది.,

Crime News: ఆమెకు అది మూడో పెళ్లి.. అతనికి రెండో పెళ్లి! భార్యపై అనుమానంతో..
Husband Murderd Wife
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 26, 2023 | 8:22 AM

బళ్లారి, నవంబర్‌ 26: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. మొదటి పెళ్లి పెటాకులు కావడంతో ఆమెను వివాహం చేసుకున్నాడు అతను. ఇక ఆమెకు అతను మూడో భర్త. కొంతకాలం సవ్యంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత గొడవలు రాసాగాయి. ఈ క్రమంలో భార్య గొంతు నులిమి భర్త దారుణంగా చంపాడు. అనంతరం పోలీసుల ఎదుట తానే చంపినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన మైసూరులో శుక్రవారం (నవంబర్ 24) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మైసూరులోని హడగలి తాలూకా ఇట్టగిలోని మాదాపురా గ్రామానికి చెందిన డింపుల్‌(36), శ్రీకాంత్‌(36) ఏడాది కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీకాంత్‌కు ఇంతకుముందు మరో మహిళతో వివాహం జరిగింది. ఇక వివాహిత డింపుల్‌కు గతంలో రెండు పెళ్లిళ్లయ్యాయి. వారిద్దరికి విడాకులిచ్చిన డింపుల్‌ మూడోసారి శ్రీకాంత్‌ను వివాహం చేసుకుంది. శ్రీకాంత్‌కు మొదటి భార్య ఉండగానే, డింపుల్‌ను పెళ్లిచేసుకుని ఇట్టగిలో కాపురం పెట్టాడు.

భార్యను హతమార్చి.. పోలీసుల ఎదుట నేరం అంగీకరించి..

వీరిద్దరూ హగరిబొమ్మన హళ్లి తాలూకాలోని ఉలవట్టి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డింపుల్‌ కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇక శ్రీకాంత్‌ కూడా హగరిబొమ్మనగల్లి తాలూకా పరిధిలోనే కోగలి తండాలో కమ్యునిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వేర్వేరు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వీరిద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే ఇటీవల శ్రీకాంత్‌కు తన భార్య డింపుల్‌పై అనుమానం మొదలైంది. ఈ విషయమై తరచూ భార్యభర్తలిద్దరూ గొడవపడేవారు. ఈ క్రమంలో శుక్రవారం భార్యభర్తలిరువురూ మరోమారు గొడవపడ్డారు. ఈ గొడవలో శ్రీకాంత్‌ ఆమె గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం తానే హత్య చేసినట్లు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీనిపై ఇట్టగి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టు ఎదుట హాజరు పరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.