Viral: నా కుమార్తెకు స్కూల్లో బలవంతంగా గుడ్డు తినిపించారు.! తండ్రి ఫిర్యాదు..

Viral: నా కుమార్తెకు స్కూల్లో బలవంతంగా గుడ్డు తినిపించారు.! తండ్రి ఫిర్యాదు..

Anil kumar poka

|

Updated on: Nov 26, 2023 | 8:27 AM

ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కోడిగుడ్లు తిన్నాక తన కూతురు అస్వస్థతకు గురైందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు వద్దంటున్నా మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్లు తినిపించారని తండ్రి పేర్కొన్నారు. తద్వారా తమ మనోభావాల్ని దెబ్బతీశారన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కోడిగుడ్లు తిన్నాక తన కూతురు అస్వస్థతకు గురైందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు వద్దంటున్నా మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్లు తినిపించారని తండ్రి పేర్కొన్నారు. తద్వారా తమ మనోభావాల్ని దెబ్బతీశారన్నారు. తాము శాకాహారులమని స్కూల్ యాజమాన్యానికి ముందే చెప్పినా టీచర్ పట్టించుకోలేదన్నారు. బలవంతంగా తమ కుమార్తెకు గుడ్డుతినిపించారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కొడతానని తన కూతురిని బెదిరించినట్టు వెల్లడించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని కూడా టీచర్ అన్నట్టు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన టీచర్, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బాలిక తండ్రి ఆరోపణల్ని స్కూల్ ఉపాధ్యాయులు కొట్టిపారేశారు. పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మాత్రమే ప్రేరేపించామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.