PGCIL Recruitment 2023: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.74 వేల జీతం

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. దేశ వ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ రీజియన్ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రీషియన్‌ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌ రీజియన్‌లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌, ఐటీఐ అర్హత కలిగిన వారు మాత్రమే ఈ పోస్టులకు..

PGCIL Recruitment 2023: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.74 వేల జీతం
PGCIL Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 26, 2023 | 2:04 PM

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. దేశ వ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ రీజియన్ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రీషియన్‌ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌ రీజియన్‌లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌, ఐటీఐ అర్హత కలిగిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఏదైనా గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి డిసెంబర్‌ 12, 2023వ తేదీ నాటికి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 12, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.200 తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.18,500 స్టైపెండ్‌ అందిస్తారు. శిక్షణ అనంతరం జూనియర్‌ టెక్నీషియన్‌ డబ్ల్యూ-3 హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. ఈ హోదాలో నెలకు రూ.21,500 నుంచి రూ.74,000 వరకు వేతనం అందుతుంది.

పోస్టుల వివరాలు..

  • జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు మొత్తం 203 ఉన్నాయి. వీటిల్లో..
  • యూఆర్‌ కేటగిరీ పోస్టులు: 89
  • ఓబీసీ కేటగిరీ పోస్టులు: 47
  • ఎస్సీ కేటగిరీ పోస్టులు: 39
  • ఎస్టీ కేటగిరీ పోస్టులు: 10
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ పోస్టులు: 18
  • పీహెచ్‌ కేటగిరీ పోస్టులు: 8
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీ పోస్టులు: 19
  • డీఎక్స్‌ ఎస్‌ఎం కేటగిరీ పోస్టులు: 5

ముఖ్య తేదీలు..

ఇవి కూడా చదవండి
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 12, 2023.
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: జనవరి-2024లో ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ