Telangana Elections: క్లైమాక్స్‌కి చేరిన తెలంగాణ ఎన్నికలు.. రేపటితో ముగియనున్న ప్రచారం.. హైస్పీడులో దూసుకెళ్తున్న పార్టీలు..
పోలింగ్ డే కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచార గడువు ముగింపు వేళ నేతల ఆవాజ్ హైపిచ్‌లో మార్మోగుతోంది. సైలెంట్ ఓటింగ్‌తో రిజల్ట్ ఏ టర్న్ తీసుకుంటుందనే చర్చల జంక్షన్‌లో సవాల్ పే సవాల్ మార్మోగాయి. పవర్ తమదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల మన్‌కీ బాత్ ఎలా ఉన్నా.. అధికారమే లక్ష్యంగా నేతలు మాటలే తూటాలుగా పేలుస్తున్నారు.
పోలింగ్ డే కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచార గడువు ముగింపు వేళ నేతల ఆవాజ్ హైపిచ్‌లో మార్మోగుతోంది. సైలెంట్ ఓటింగ్‌తో రిజల్ట్ ఏ టర్న్ తీసుకుంటుందనే చర్చల జంక్షన్‌లో సవాల్ పే సవాల్ మార్మోగాయి. పవర్ తమదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల మన్‌కీ బాత్ ఎలా ఉన్నా.. అధికారమే లక్ష్యంగా నేతలు మాటలే తూటాలుగా పేలుస్తున్నారు. తారస్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. కేవలం 48 గంటలు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో పార్టీలు మరింత దూకుడు పెంచనున్నాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగియనుంది.. ఆ తర్వాత ప్రలోభాల పర్వం షురూ కానుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ 48గంటలు మరింత దూకుడుగా వ్యవహారించనున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా, నడ్డా, యోగి.. పవన్‌కల్యాణ్ తో పాటు కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఈటల జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత సుడిగాలి పర్యటనతో ప్రచారాలను హోరెత్తిసున్నారు.కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్య తో పాటు రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
బీజేపీ..
మహబూబాబాద్, కరీంనగర్‌లో ఇవాళ మోదీ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. హుజురాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలలో ఇవాళ అమిత్‌షా ఎన్నికల ప్రచారం చేస్తారు. జగిత్యాల, బోధన్, బాన్సువాడ, జుక్కల్‌లో జేపీ నడ్డా క్యాంపెయిన్ చేస్తారు. దేవరకద్ర, మంథని, పరకాలలో అసోం సీఎం బిశ్వశర్మ ప్రచారం చేస్తారు. హనుమకొండలో పీయూష్ గోయల్ ప్రచారంతోపాటు మేధావులతో సమావేశం కానున్నారు.
బీఆర్ఎస్..
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. ఎన్నికల వ్యూహాలు, జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు, ప్రతిపక్షాలకు కౌంటర్లతో ప్రచారంలో కాక రేపుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలను చుట్టేసిన కేసీఆర్.. ఇవాళ మరో నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. షాద్‌నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సుల్తానాబాద్, వెల్గటూర్, చెన్నూర్, హైదరాబాద్‌లో కేటీఆర్ రోడ్‌షోలతోపాటు.. హుజురాబాద్, ఏటూరునాగారం, అంబర్‌పేట్, ముషీరాబాద్‌లో కేటీఆర్ ప్రచారం చేస్తారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
కాంగ్రెస్..
భువనగిరి, గద్వాల, కొడంగల్‌లో నేడు ప్రియాంక ప్రచారం చేయనున్నారు. ఇల్లందు, డోర్నకల్, కొడంగల్‌లో ఇవాళ రేవంత్ సభల్లో పాల్గొంటారు. నర్సాపూర్‌లో ఖర్గే ప్రచారం, సాయంత్రం 4:30కి బహిరంగ సభలో పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..