Telangana Politics: ఛాలెంజ్..! బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ..

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్‌కు అమృత్ టెండర్ల అంశం మరింత ఆజ్యం పోసింది. అమృత్‌ టెండర్లతో సీఎం రేవంత్‌ తన బంధువులకు దోచిపెట్టారని కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఈ ఎపిసోడ్‌లో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.

Telangana Politics: ఛాలెంజ్..! బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ..
Ponguleti Srinivas Reddy - KTR
Follow us

|

Updated on: Sep 23, 2024 | 9:38 AM

తెలంగాణ రాజకీయాల్లో అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కేంద్రం అమలు చేస్తున్న అమృత్‌ పథకంలో భారీగా రేవంత్ బంధువులు అక్రమాలకు పాల్పడ్డారన్న కేటీఆర్ ఆరోపణలు పొలిటికల్‌గా కాక పుట్టించాయి. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు అర్హతలు లేకుండా ఏకంగా రూ.8,888కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అయితే కేటీఆర్‌ కామెంట్స్‌కు గట్టిగానే రియాక్ట్‌ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఆరోపణలు నిజమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అబద్ధమని తేలితే కేటీఆర్‌ రాజీనామా చేస్తారా? అని ఛాలెంట్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే కేటీఆర్ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు అమృత్‌ టెండర్లలో కుంభకోణం జరిగిందని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. మంత్రి పొంగులేటి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో కుంభకోణం జరగలేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

రుజువు చేయాలన్న కోమటిరెడ్డి

కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. దమ్ముంటే కేటీఆర్‌ తాను చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాము దేనికైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదని.. అందుకే కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

కేటీఆర్ చేసిన ఆరోపణలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్‌ సరికొత్త టర్న్ తీసుకుంది. ఈ విషయంలో కేటీఆర్ దూకుడుగా ప్రదర్శిస్తుంటే… ఆయనకు కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..