Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందటే

బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలకు చేరువైంది. దీంతో పసిడి ధర తర్వలోనే రూ. 80 వేల మార్క్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తులం బంగారంపై...

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందటే
Gold Price
Follow us

|

Updated on: Sep 23, 2024 | 6:22 AM

బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలకు చేరువైంది. దీంతో పసిడి ధర తర్వలోనే రూ. 80 వేల మార్క్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తులం బంగారంపై రూ. 10 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 75,920 వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,740గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 76,070 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోది.

* చెన్నై విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోంది.

* దేశంలో మరో ప్రధాన నగరమైన బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* తెలగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,590, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920గా ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,900గా ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 97,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..