AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale: అమెజాన్‌ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్‌ ఆఫర్‌.. భారీ తగ్గింపు!

ప్రముఖ ఈ-కామర్స్ సర్వీస్ అయిన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఈ నెల 27 నుంచి ప్రారంభించనుంది. సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై లభించే డిస్కౌంట్లు బయటకు వచ్చాయి. ఐఫోన్ 13 అత్యంత ఆకర్షణీయమైన తగ్గింపును..

Amazon Sale: అమెజాన్‌ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్‌ ఆఫర్‌.. భారీ తగ్గింపు!
Subhash Goud
|

Updated on: Sep 22, 2024 | 9:07 PM

Share

ప్రముఖ ఈ-కామర్స్ సర్వీస్ అయిన అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఈ నెల 27 నుంచి ప్రారంభించనుంది. సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై లభించే డిస్కౌంట్లు బయటకు వచ్చాయి. ఐఫోన్ 13 అత్యంత ఆకర్షణీయమైన తగ్గింపును వస్తుంది. ఈ నెలలో ఐఫోన్ 16 సిరీస్ విడుదలతో ఐఫోన్ 13 తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 13 బేసిక్ మోడల్ రూ.37,999కి అందుబాటులో ఉంటుంది. తమ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం.

Samsung ప్రీమియం ఫోన్ S23

ఇక శాంసంగ్‌ ప్రీమియం ఫోన్ S23 అల్ట్రాపై కూడా ఈ సేల్‌లో భారీ తగ్గింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అద్భుతమైన కెమెరాతో ఉంది. అయితే ఈ ఫోన్‌ ప్రస్తుతం ధర రూ.85,000 వరకు ఉండగా, ఆఫర్‌లో భాగంగా రూ. 69,999.

ఈ శాంసంగ్‌ ఎస్‌ సిరీస్‌లో కొత్త మోడల్ రాకతో పాత మోడల్ ధర తగ్గింది. S24 సిరీస్ ఈ సంవత్సరం విడుదలైంది. శాంసంగ్‌ S24 సిరీస్ iPhone 16 సిరీస్‌కు పోటీగా మార్కెట్లో విడుదలైంది. అందువల్ల ఇది మునుపటి మోడల్ కంటే చౌకగా ఉంటుంది. Xiaomi 14, One Plus 12R, IQ Z9, Samsung S24, Honor 200 5G, Motorola Razr 50 Ultra వంటి వివిధ స్మార్ట్‌ ఫోన్‌లు ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నాయి. వివిధ బ్యాంకు కార్డులపై భారీ తగ్గింపుతో వస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి