కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఈయన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో.. ఆయన్ను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. అనంతరం పన్నెండేళ్ల […]

కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 12:15 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఈయన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో.. ఆయన్ను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. అనంతరం పన్నెండేళ్ల పాటు గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. గ్రామ సర్పంచ్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఉమ్మడి ఏపీకి రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. బుగ్గారం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. మాజీ మంత్రి రత్నాకర్ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రత్నాకర్ రావు అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలంటూ సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.