AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS vs BJP: తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల మోడలా? కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

TRS vs BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

TRS vs BJP: తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల మోడలా? కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy
Shiva Prajapati
|

Updated on: Sep 01, 2022 | 5:01 PM

Share

TRS vs BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ తీరు కారణంగా వివిధ రాష్ట్రాల వారు తెలంగాణను చూసి నవ్వుకుంటున్నారని దుయ్యబట్టారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశానికి తాను, తన కుటుంబమే దిక్కు అన్నట్లుగా కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తానేదో తెలంగాణను ఉద్ధరించానని చెబుతూ దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ, బీహార్, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక నేతలను కేసీఆర్ కలిశారని, ఎక్కడికి వెళ్లి ప్రచారం చేసినా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్‌ని చూసి నవ్వుకుంటే పర్లేదని, తెలంగాణను చూసి నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

నిన్న బిహార్ పర్యటనలో కేసీఆర్ మాటలు వినలేక నితీష్ లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని అన్నారు కిషన్ రెడ్డి. వన్ సైడ్ రాజకీయాలు చేస్తున్నందుకే కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. నితీష్‌ను బతిమిలాడినా.. కేసీఆర్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. తాను ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేస్తానని కేసీఆర్ అంటున్నారని, వాస్తవంగా మాత్రం ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ మోడల్ అని ప్రచారం చేసుకుంటున్నారని, తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల కుటుంబం మోడలా? ప్రజలకు అందుబాటులో ఉండకకుండా ఉండటమే తెలంగాణ మోడలా? అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈడీ, సీబీఐలను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారాయన. ఏ రాష్ట్రంపై కూడా తమకు వివక్ష ఉండదన్నారు. అన్ని రాష్ట్రాలు తమకు సమానమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ బకాయిలు చెల్లించమని కేంద్రం సలహా ఇచ్చిందన్నారు.

దేశం సంగతి తర్వాత అని, ముందు తెలంగాణలో తేల్చుకుందామంటూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పట్లో తెలంగాణ సంపదను యూపీ, బీహార్‌లో పంచుతున్నారని ఆరోపించిన కేసీఆర్‌.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ డబ్బులన్నింటినీ బీహార్, పంజాబ్ రాష్ట్రాలలో పంచుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో మునావర్ షో పై తీవ్రంగా స్పందించారు. మునావర్ షోకు అంత పెద్ద ఎత్తున భద్రత కల్పించి నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. బీజేపీ పాలనలో ఏ రాష్ట్రంలోనూ మత కలహాలు చోటు చేసుకోలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..