Hyderabad: గణపతి మండపాలకు రైస్ బ్యాగ్స్ పంపిణీ చేసిన బాలింగ్ సతయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్
హఫీజ్ పెట్ 109 డివిజన్ TRS ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ మండపాల నిర్వాహకులకు స్వయంగా రైస్ బ్యాగ్స్ అందజేశారు. గణపయ్య చల్లని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ఆకాక్షించారు.
Telangana: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు భక్తులు. ఊరూ, వాడ బొజ్జ గణపయ్య ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. దూప, దీప, నైవేద్యాలను సమర్పించారు. వినాయక మండపాల దగ్గర సంబరాలు.. పాటలు, డీజేలతో కాలనీలు మార్మోగాయి. వీటికి మించి.. తెలంగాణలో వెరైటీ వినాయక విగ్రహాలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కరెన్సీ, కూరగాలతో కూడా కొందరు గణపయ్య బొమ్మలు చేశారు. ఇక వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అందరూ అన్నదానం చేస్తారన్న విషయం తెలిసిందే. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ హఫీజ్‌పేట్ 109 డివిజన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకి బాలింగ్ సతయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున రైస్ బ్యాగ్స్ పంపిణీ చేవారు. హఫిజ్ పెట్ 109 డివిజన్ TRS ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ మండపాల నిర్వాహకులకు స్వయంగా రైస్ బ్యాగ్స్ అందజేశారు. గణపయ్య చల్లని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ఆకాక్షించారు. తన తండ్రిలో బాటలో పయనిస్తున్న గౌతమ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజల్లో ఉండి.. తన శక్తిమేరకు సాయం చేశారు. పేద ప్రజల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ, పేద విద్యార్థలకు సాయం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు.