Karimnagar: చేపల కోసం వల వేసిన జాలర్లు.. అందులో చిక్కింది చూసి మైండ్ బ్లాంక్
పాపం జాలర్లు.. వలగా బరువుగా అనిపించడంతో.. బాగానే జలపుష్పాలు పడ్డాయ్ అనుకున్నారు. కానీ వారు అనుకన్నది ఒక్కటి... అయ్యింది ఒక్కటి.
Telangana: వేటకు వెళ్లిన మత్య్సకారులకు కాసిన్ని ఎక్కువ చేపలు పడితే.. రోజూ కంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయ్. అరుదైన చేపలు పడితే దశ తిరిగిపోతుంది. పులస చేప ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక అలాంటి పులసలు ఓ నాలుగు పడితే పండగే. ఇవి కాకుండా వైద్య ఔషధాల తయారిలో ఉపయోగపడే కచ్చిడి చేపలు.. వలలో పడినా గిట్టుబాటు అవుతుంది. కానీ కొన్నిసార్లు పాపం జాలర్ల శ్రమ అంతా వృథా అవుతుంది. చేపల కోసం వల వేస్తే పాములు, కొండచిలువలు, మొసళ్లు అందులో చిక్కుకుంటాయి. ఇటీవల అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం(Jammikunta mandal) కోరపల్లి గ్రామం(Korapalli village)లో ఇటీవల చోటుచేసుకుంది. భారీ ఖాయంతో దాదాపు 10 ఫీట్ పొడవున్న కొండచిలువ వలలో చిక్కుకుంది. భారీగా చేపలు పడ్డాయ్ అనుకుని.. వలను బయటకు లాగిన జాలర్లు దాన్ని చూసి కంగుతిన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమచారమిచ్చారు. వలలో కొండచిలువ కొంతభాగం ఇరుక్కుపోయింది. దీంతో ఆ వల డ్యామేజ్ అయ్యింది. కాగా ఈ భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు దాన్ని బంధించి.. తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వన్య ప్రాణాలు ఏవైనా జనావాసాల్లోకి వచ్చినా.. ఇలా కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి