AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu: జర్నలిజంలో TV9 స‌రికొత్త ప్రయోగం.. ఈ అవార్డులు ఇతరులకు ఆదర్శం కావాలన్న మాజీ ఉప రాష్ట్రపతి

TV9 Nava Nakshatra Sanmanam: ప్రతి పలుకులో తియ్యందనం..మాతృభాషపై అంతులేని మమకారం.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పదహారణాల పంచెకట్టు నిండుదనం..వెరసి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనసంతా తెలుగుదనం!! వారసత్వంతో కాదు..

Venkaiah Naidu: జర్నలిజంలో TV9 స‌రికొత్త ప్రయోగం.. ఈ అవార్డులు ఇతరులకు ఆదర్శం కావాలన్న మాజీ ఉప రాష్ట్రపతి
Venkaiah Naidu
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2022 | 1:18 PM

టీవీ రంగంలో ఇది నూతన ప్రయోగం, ఇలాంటి కార్యక్రమాలను అందరూ అనుసరించవల్సిదే అని అన్నారు. టీవీ9 ప్రతిష్టాత్మక నవనక్షత్ర సన్మానోత్సవ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారధులంతా హాజరయ్యారు. ‘టీవీ9 నవనక్షత్ర సన్మానం-2022’  కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో తమ తెలివితేటలను, ప్రతిభా విశేషాలను ఏదోవిదంగా బయటకు తీసుకొచ్చి వాటి ద్వారా ప్రజలను రంజింపచేయడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఏదో ఓ రంగంలో పేరు వస్తుంటుంది. పేరు కోసం కాకుండా జీవితలక్ష్యం దేశంలో అనేక వేలమంది ఉన్నారు. వారిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం అని అన్నారు. జర్నలిజంలో సరికొత్త మైలురాయిని ఏర్పాటు చేసిందన్నారు.

19 ఏళ్ల క్రితం ప్రారంభమైన టీవీ9 ఇవాళ దేశ వ్యాప్తంగా పేరు ప్రత్యేకతలు తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు. వార్తలను అందించడం ఓ ఎత్తైతే.. తనదైన రీతిలో సామాజికి సేవలో చురుకుగా పాల్గొనడం మరో ఎత్తు అంటూ టీవీ9ను ప్రశంసించారు. ఇలాంటి అవార్డులు ఇతరులకు ఆదర్శంగా మారతాయని అభిలాషించారు. అవార్డు తీసుకున్నవారి గొప్పపనులు ఇతరులకు తెలుస్తాయి.

మనం ఇచ్చే సమాచారంలో వాస్తవాన్ని తెలుసుకుని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. సమాజంలో వేగం ఎంత ముఖ్యమో.. వాస్తవం అంతకంటే ముఖ్యం అని నొక్కి చెప్పారు. భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యమన్నారు. మన భాషను మనం పరిరక్షించుకోవాలన్నారు.

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురించి..

ప్రతి పలుకులో తియ్యందనం..మాతృభాషపై అంతులేని మమకారం.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పదహారణాల పంచెకట్టు నిండుదనం..వెరసి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనసంతా తెలుగుదనం!! వారసత్వంతో కాదు.. జవసత్వాలతో రాజకీయాల్లోకి వచ్చి.. జై ఆంధ్ర ఉద్యమ కెరటమై ఎగసి.. ఎమర్జెన్సీలో ధిక్కార స్వరమై.. ఇందిర హవాలో కూడా ఉదయగిరిలో విజయమై ఉదయించిన తెలుగు పౌరుషం ముప్పవరపు. నమ్మిన సిద్దాంతాలే ఊపిరిగా.. భారతీయ జనతాపార్టీ యువ విభాగం నుంచి ఎదిగి.. రాజ్యసభ సభ్యుడుగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా, కేంద్రమంత్రిగా, భారత ఉప రాష్ట్రపతిగా దేశ సేవలో తరించిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతిగా దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ చుట్టి.. ఐదేళ్లలో వెయ్యికిపైగా కార్యక్రమాల్లో పాల్గొన్న రికార్డు ఆయన సొంతం.

అభిమానం.. ఆప్యాయత.. ఆహార్యం.. ఇలా తెలుగుదనానికే నిండుదనం మన వెంకయ్య. ఆ తెలుగు యశస్సుకు ‘టీవీ9 నవనక్షత్ర సన్మానం-2022’ వేదిక నుంచి ఆత్మీయ ఆహ్వానం పలికింది. ఈ వేడుకకు సరికొత్త తేజస్సు నొసంగినందుకు.. ముప్పవరపు వెంకయ్యనాయుడుగారికి టీవీ9 కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం