Telangana: మళ్లీ NDAలోకి TDP.. ప్రచారంపై పూర్తి క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ లక్ష్మణ్

తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్డీఏలో చేరబోతుందని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు.

Telangana: మళ్లీ NDAలోకి TDP.. ప్రచారంపై పూర్తి క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ లక్ష్మణ్
Rajya Sabha Mp Laxman
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2022 | 1:34 PM

NDAలోకి టీడీపీ తిరిగి వస్తుందన్నది ప్రచారం మాత్రమేనని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. టీడీపీతో తాము ఎటువంటి చర్చలు జరపడం లేదని తెలిపారు. అటువంటి ఆలోచన లేదన్నారు.  తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏపీలో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేస్తుందని లక్ష్మణ్‌ వెల్లడించారు. ఏపీలో రోజురోజుకు ఎదుగుతున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే..  కాంగ్రెస్‌ పంచన చేరడానికి సీఎం కేసీఆర్‌ తహతహలాడుతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇంట గెలవడం చేతగాక కేసీఆర్‌ బయట రచ్చ చేస్తున్నారని అన్నారు. TRS- కాంగ్రెస్‌ వేరు కాదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. BJPని నేరుగా ఎదుర్కోలేక ఇతర పార్టీలతో జట్టు కడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆర్థిక సాయం పేరుతో కేసీఆర్‌ దేశమంతా తిరుగుతున్నారని తెలిపారు. దేశ్‌ కీ నేత పేరుతో కేసీఆర్‌ చేస్తున్న విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని లక్ష్మణ్‌ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి