Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Nava Nakshatra Sanmanam 2022: సామాన్యుల్లో అసామాన్యులకు లైఫ్‌ టైం ఎచివ్‌మెంట్ పురస్కారం.. నవనక్షత్ర సన్మానంతో TV9 సత్కరం

tv9 నవనక్షత్ర సన్మానంలో భాగంగా వ్యవసాయం, పబ్లిక్‌ సర్వీస్‌, సోషల్‌ సర్వీస్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌, హెల్త్‌ కేర్‌, స్పోర్ట్స్‌, ఫిల్మ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పాపులర్‌ ఛాయిస్‌, అన్‌సంగ్‌ హీరోస్‌ ఇన్సిరేషన్స్‌ అన్‌సంగ్‌ హీరోస్‌ కరేజ్‌..

TV9 Nava Nakshatra Sanmanam 2022: సామాన్యుల్లో అసామాన్యులకు లైఫ్‌ టైం ఎచివ్‌మెంట్ పురస్కారం.. నవనక్షత్ర సన్మానంతో TV9 సత్కరం
Tv9 Nava Nakshatra Sanmanam
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2022 | 1:52 PM

వివిధ రంగాల్లో కృషి చేసిన మాన్యులు… సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి గౌరవించే కార్యక్రమం చేపట్టింది టీవీ9. ఈ tv9 నవనక్షత్ర సన్మానంలో భాగంగా వ్యవసాయం, పబ్లిక్‌ సర్వీస్‌, సోషల్‌ సర్వీస్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌, హెల్త్‌ కేర్‌, స్పోర్ట్స్‌, ఫిల్మ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పాపులర్‌ ఛాయిస్‌, అన్‌సంగ్‌ హీరోస్‌ ఇన్సిరేషన్స్‌ అన్‌సంగ్‌ హీరోస్‌ కరేజ్‌, అన్‌సంగ్‌ హీరోస్‌ బ్రేవరీతోపాటు లైఫ్‌ టైం ఎచివ్‌మెంట్ పురస్కారంతో సత్కరించింది TV9. టీవీ9 ప్రతిష్టాత్మక నవనక్షత్ర సన్మానోత్సవ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారధులంతోపాటు ముఖ్య అతిధిగా మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్న..

నమ్మిన ప్రకృతి సేద్యం కోసం నిలబడటమేకాదు.. దక్షిణాదిన వేలాది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్న గుడివాడ నాగరత్నం నాయుడుకు.. అగ్రికల్చర్‌ కేటగిరిలో.. నవనక్షత్ర సన్మానం- 2022 పురస్కారం”… టీవీ9 సగర్వంగా అందించింది.

నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఉద్యోగ సోపానం

విద్యార్థులను లక్ష్యం వైపు గురిపెట్టిన ఆచార్యుడు ఏడుకొండలు..! నాగర్ కర్నూల్‌లో ఎక్సైజ్ సిఐగా పనిచేస్తూనే.. నిత్యం వేలాదిమంది నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఉద్యోగ సోపానం ఆయన..! యువత బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్న ఏడుకొండలు మాస్టారుకి.. పబ్లిక్ సర్వీస్ విభాగంలో నవ నక్షత్ర సన్మానం 2022 అవార్డుతో సత్కరించింది టీవీ9.

వైద్య పరిశోధనా రంగంలో నిరంతర అధ్యయనశీలిగా..

వైద్యుడిగా ప్రాణాలను.. నిరంతర అధ్యయనశీలిగా వైద్య పరిశోధనా రంగాన్ని నిలబెడుతున్నారు గ్యాస్ట్రోఎంటెరాలజిస్ట్‌ డాక్టర్‌ రాకేష్‌ కలపాల..! Asian Institute of Gastroenterology లో ఎండోస్కోపీ విభాగం డైరెక్టర్‌గా సేవలందిస్తున్న రాకేష్‌ కలపాల.. ఎడ్వాన్స్‌డ్ ఎండోస్కోపీ ప్రక్రియల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. డాక్టర్‌ రాకేష్‌ కలపాలను.. “నవనక్షత్ర సన్మానం-2022” మెడిసిన్‌ విభాగంలో అవార్డుతో సత్కరించింది టీవీ9.

పదంటే పది రూపాయలకే వైద్యం..

వైద్యాన్ని ఫక్తు వ్యాపారంగా మార్చేసి నిలువు దోపిడీ చేస్తున్న ఈ రోజుల్లో.. కేవలం పదంటే పది రూపాయలకే వైద్యం అందిస్తున్నారు డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఉల్చాల..! హైదరాబాద్‌ పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్‌ని ఏర్పాటు చేసి.. ఉచితంగా కరోనా రోగులకు సేవలు అందించారు. డా. విక్టర్ ఇమాన్యుయల్‌ సోషల్ సర్వీస్ కేటగిరీలో “నవనక్షత్ర సన్మానం-2022” పురస్కారం.. టీవీ 9 సగర్వంగా అందించింది.

ప్లాస్టిక్‌ మహమ్మారిపై పోరాడుతున్న..

వందల ఏళ్ళపాటు మరణం లేని ప్లాస్టిక్‌ మహమ్మారిని.. 90 రోజుల్లో మట్టిలో కలిసేలా శాసించిన శాస్త్రవేత్త డా. వీరబ్రహ్మం! మొక్కజొన్నతో బయో ప్లాస్టిక్‌ రూపొందించారు. DRDO చీఫ్‌ సైంటిస్ట్‌ వీరబ్రహ్మం నేతృత్వంలోని బృందం! భూమి, నీటిలో ఎరువుగా మారే ప్లాస్టిక్‌ అందుబాటులోకి తెచ్చిన డాక్టర్‌ వీరబ్రహ్మానికి.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో..నవనక్షత్ర సన్మానం-2022 పురస్కారం… టీవీ9 అందించింది.

రెక్కల కష్టమే పెట్టుబడిగా..

నీలోఫర్‌ ఛాయ్‌కి ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేయడంలో.. ఆ సామాన్యుడి అకుంఠిత దీక్ష, కృషి ఉంది. రెక్కల కష్టమే పెట్టుబడిగా పెట్టి.. క్లీనర్‌ నుంచి కేఫ్‌ యజమాని స్థాయికి ఎదిగారు ఆ అసామాన్యుడు అనుముల బాబురావు..! ఓ సామాన్యుడి అసామాన్య విజయానికి ప్రతీకగా నిలిచిన బాబురావుకు.. Entrepreneurship విభాగంలో నవనక్షత్ర సన్మానం-2022 పురస్కారం.. టీవీ9 సగర్వంగా అందించింది

బాక్సింగ్‌ బరిలో ఓ ఉప్పెన..

బాక్సింగ్‌ బరిలో నిఖత్‌ జరీన్‌ ఓ ఉప్పెన! తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్‌ నేర్చుకున్న నిఖత్ జరీన్‌..ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అదే దూకుడుతో..కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ భారత్‌కు పసిడి పతకాన్ని సాధించింది ఈ బంగారు తల్లి! దేశం గర్వించే విజయాలతో.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నిఖత్‌ జరీన్‌కు..స్పోర్ట్స్‌ కేటగిరీలో నవనక్షత్ర సన్మానం-2022 పురస్కారం టీవీ9 సగర్వంగా అందించింది.

దశాబ్దాల వివక్షను ఎదిరించి.. 

ఉద్యోగ అవకాశాల్లో పురుషాధిక్యతను సవాల్‌ చేసి.. దేశంలోనే తొలి లైన్‌ ఉమెన్‌గా రికార్డు సృష్టించారు భారతి, శిరీష! తెలంగాణ సదరన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌లో మహిళలపై దశాబ్దాల వివక్షను ఎదిరించి.. ఆకాశమే హద్దుగా , అవకాశాన్ని పిడికిట బిగించారు. వివక్షను ఎదిరించి..మహిళా విజయానికి ప్రతీకగా నిలిచిన లైన్‌ ఉమెన్‌ భారతి, శీరీషలకు “నవనక్షత్ర సన్మానం-2022 Unsung Heroes Inspirtation” అవార్డుతో సత్కరించింది టీవీ9.

ట్యాంక్ బండ్ శివ..!

ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టగలడు..! కొన ఊపిరికి నూరేళ్ళ ఆయుష్షు పోయగలడు..! అతనే ట్యాంక్ బండ్ శివ..! గుడి గట్టు మీద కాపురం ఉంటూ.. తోటి మనుషుల ప్రాణాలకు కాపలా కాస్తున్నాడు శివ! రోదన కూడా అనాథగా మారిపోతున్న ఈ రోజుల్లో.. ఎన్నో ప్రాణాలు కాపాడుతున్న మనసున్న శివకి.. “నవ నక్షత్ర సన్మానం- 2022” వేడుకల్లో “Unsung Heroes-Courage” అవార్డుతో సత్కరించింది టీవీ9.

త్యాగధనుడు..

మాతృభూమి కోసం మరణాన్ని ముద్దాడిన ధీరుడు! గాల్వాన్‌ లోయలో చైనా చొరబాట్లను తిప్పికొట్టే ప్రయత్నంలో అమరుడైన త్యాగధనుడు కల్నల్‌ సంతోష్‌ బాబు! మృత్యు ఘడియల్లో కూడా “భారత్‌మాతా కీ జై” అని నినదించిన ఆ దేశభక్తుడికి..”నవనక్షత్ర సన్మానం-2022 Unsung Heroes Bravery” పురస్కారంతో గౌరవించింది టీవీ9.

స్ఫూర్తి శిఖరం

ముష్కరమూకలను తరిమికొట్టి.. హిమాలయంపై మువ్వన్నెల జెండా ఎగురవేసే స్ఫూర్తి శిఖరం చీకల ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి..! 2020, నవంబరు 8న జరిగిన ఉగ్రవాద దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో వీరోచితంగా ముష్కరులతో పోరాడి..వీరమరణం పొందారు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి. దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన ఈ తెలుగు వీరుడికి.. Unsung Heroes Bravery అవార్డును…టీవీ9 సగౌరవంగా సమర్పించింది.

ఉప్పెనలా దూసుకొచ్చిన బేబమ్మగా..

తెలుగు ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన అందం కృతి శెట్టి. గతేడాది విడుదలైన ఉప్పెన చిత్రంలో నటించి.. తెలుగు ప్రేక్షకులకు బేబమ్మగా పరిచయం అయిపోయారు కృతి. తెలుగు ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంటున్న కృతికి.. ఫిల్మ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పాపులర్‌ ఛాయిస్‌ విభాగంలో నవనక్షత్ర సన్మానం-2022 పురస్కారం టీవీ9 అందించింది.

గ్రౌండ్ లోకి దిగి సత్తా చాటిన..

బ్యాక్ గ్రౌండ్ చూసి సినిమా ఆఫర్ వచ్చింది అన్న వాళ్ళకి గ్రౌండ్ లోకి దిగి సత్తా చాటిన యంగ్ హీరో వైష్ణవ తేజ్‌. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరి అందర్నీ ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెల్చుకున్న వైష్ణవ తేజ్‌కి ఫిలిం అండ్ ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఛాయస్ విభాగంలో.. నవ నక్షత్ర సన్మానం 2022 లో పురస్కారం అందించింది టీవీ9.

దర్శకేంద్రుడికి..

మూడు తరాలకు హీరోలను తయారు చేసి… మూడు జనరేషన్‌ల ఆడియన్స్‌ను మెప్పించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన చేయని ప్రయోగం లేదు.. తెలుగు సినిమా తరాలు తరాలు చెప్పుకునే ఎన్నో అద్భుతాలను అందించిన రాఘవేంద్రరావుకి నవనక్షత్ర సన్మానం 2022 లో లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందించింది టీవీ 9.

అభిమానం.. ఆప్యాయత.. ఆహార్యం.. ఇలా..

ప్రతి పలుకులో తియ్యందనం..మాతృభాషపై అంతులేని మమకారం.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పదహారణాల పంచెకట్టు నిండుదనం..వెరసి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనసంతా తెలుగుదనం!! టీవీ9 నవనక్షత్ర సన్మానం-2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు.. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. సగౌరవంగా సన్మానించింది టీవీ9 కుటుంబం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం