Kishan Reddy: కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

అంబర్ పేట బర్కత్‌పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని తెలిపారు.

Follow us
Srikar T

|

Updated on: Nov 30, 2023 | 9:57 AM

అంబర్ పేట బర్కత్‌పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని తెలిపారు. తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ విధానాన్ని విమర్శించే ముందు ఓటు హక్కు ముఖ్యమైనదని, ఓటు వేయకుండా ఎవరిని విమర్శించే అవకాశం రాదన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యం ప్రభావంతో ఓట్లను కొనాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని, నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలన్నారు. ఎవరికి భయ పడకుండా ఓటు వేయాలన్నారు.

ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ఓటర్లను కోరారు. తెలంగాణ ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు వేసిన తర్వాతే రోజు వారీ పనులు చేసుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం స్పందించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..