Exit Poll Result 2023 Date: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎవరు, ఎలా నిర్వహిస్తారో తెలుసా?

Telangana Opinion Poll Result 2023 Date, Time: ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి ఇచ్చే సమాచారం. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహించే ఓటరు సర్వేలు. ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. తద్వారా విజేతలను అంచనా వేయడంలో సహాయపడతాయి.

Exit Poll Result 2023 Date:  ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎవరు, ఎలా నిర్వహిస్తారో తెలుసా?
Exit Poll Result 2023 Date
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2023 | 9:42 AM

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం పోలింగ్ పూర్తైంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగనుంది. సాధారణంగా పోలింగ్ పూర్తైన వెంటనే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌ వైపు మళ్లుతుంది. ఎలక్షన్లకు ముందు వివిధ సంస్థల సర్వేలు హడావిడి చేస్తే, పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హీట్ పెంచుతుంటాయి. ఏపార్టీకి ఓట్లు ఎక్కవగా పోలయ్యాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. విజయం ఎవరిని వరించనుంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? వాటిని ఎలా నిర్వహిస్తారు ? ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పే లెక్కలు ఎంత వరకు నిజం.. అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి ఇచ్చే సమాచారం. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహించే ఓటరు సర్వేలు. ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. తద్వారా విజేతలను అంచనా వేయడంలో సహాయపడతాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నమ్మదగినవి కానప్పటికీ, అవి ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాల గురించి స్థూలమైన అంచనాను అందిస్తాయి.

కొన్ని ప్రత్యేక సంస్థలు ఎన్నికలకు ముందు ప్రీపోల్స్, ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. ప్రీపోల్స్ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు చేపట్టే ప్రక్రియ. వివిధ రాజకీయ పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుందని విశ్లేషిస్తారు. పోలింగ్ తేదీ సమీపించినప్పుడు నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుని ప్రీపోల్స్ నిర్వహిస్తారు. అయా నియోజకవర్గాల వారీగా ఓటర్లను కలుసుకుని ఏ అభ్యర్థి నిలబడతారు, ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉందినే విషయాన్ని సేకరించి పోల్ రిజల్ట్ వెల్లడిస్తారు.

ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. పోలింగ్ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రల వద్ద ఓట్ల నాడీని తెలుసుకుని ఒక అంచనాకు వస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కకడతారు. ప్రీపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొని సర్వే చేస్తారు. కానీ ఎగ్జిట్‌పోల్‌లో అలా కాదు. పోలింగ్ రోజే, ఓటు వేసేందుకు వచ్చే వారిని మాత్రమే ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.

మొత్తంగా చూస్తే ప్రీపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో ఖచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్‌కు దాదాపు దగ్గరగా ఉంటాయి. ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు పలు విడతల్లో పోలింగ్ జరగ్గా.. తెలంగాణకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 7 నుంచి 5 గంటల వరకు సాగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే సాయంత్రం 6 గంటలకు ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయనున్నాయి.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…