AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ఓట్ల పండగలో సినిమా తారలు.. క్యూలో నిల్చొని ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌

తెలంగాణలో ఓట్ల పండగ ప్రారంభమైంది. గురువారం (నవంబర్‌ 30) ఉదయం నుంచే పోలింగ్‌ సెంటర్ల వద్ద హడావిడి నెలకొంది. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Telangana Elections: ఓట్ల పండగలో సినిమా తారలు.. క్యూలో నిల్చొని ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌
Chiranjeevi, Allu Arjun, Jr. NTR
Basha Shek
| Edited By: |

Updated on: Nov 30, 2023 | 9:42 AM

Share

తెలంగాణలో ఓట్ల పండగ ప్రారంభమైంది. గురువారం (నవంబర్‌ 30) ఉదయం నుంచే పోలింగ్‌ సెంటర్ల వద్ద హడావిడి నెలకొంది. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు చిరంజీవి. మెగాస్టార్‌ వెంట ఆయన సతీమణి సురేఖ, కూతురు శ్రీజ ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూలులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు నటుడు ఎన్టీఆర్. అందరితో పాటు క్యూలో నిలబడి మరీ ఓటు వేసిన ఎన్టీఆర్..ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అలాగే జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ హీరో అల్లు అర్జున్. ఉదయం 7గంటలకే క్యూలో నిలబడి పోలింగ్ కేంద్రానికి రాగా… ఈవీఎం మొరాయించింది. కాసేపు వెయిట్ చేసి…ఆ తర్వాత ఓటు వేసి వెళ్లారు అల్లు అర్జున్. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో సుమంత్‌ ఓటు వేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి జూబ్లీ హిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లోతన ఓటు హక్కును వినియోగించారు. ఆయన వెంట కుమారుడు, ప్రముఖ సింగర్‌ కాల భైరవ కూడా ఉండి ఓటును వేశారు.

జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేసిన చిరంజీవి కుటుంబ సభ్యులు..

అల్లు అర్జున్

జూబ్లీ హిల్స్ ఓటుల్ రెడ్డి స్కూల్  వద్ద ఎన్టీఆర్ ఫ్యామిలీ..

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..
ఏం అమ్మాయి రా బాబూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..
ఏం అమ్మాయి రా బాబూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..