Pooja Gandhi: పెళ్లిపీటలెక్కిన దండుపాళ్యం నటి.. వ్యాపారవేత్తతో కలిసి ఏడడుగులు.. వీడియో
ప్రముఖ కన్నడ నటి, దండు పాళ్యం ఫేమ్ పూజా గాంధీ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బుధవారం (నవంబర్ 29)న యలహంకలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పూజా గాంధీ వివాహ వేడుకకు హాజరయ్యారు
ప్రముఖ కన్నడ నటి, దండు పాళ్యం ఫేమ్ పూజా గాంధీ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బుధవారం (నవంబర్ 29)న యలహంకలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పూజా గాంధీ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పూజా గాంధీని కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన యోగరాజ్ భట్, నటి సుధారాణి, బుజ్జి గాడు ఫేమ్ సంజనా గల్రానీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పూజా గాంధీ పెళ్లి వేడుకలో సందడి చేశారు. కాగా పూజా గాంధీ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ‘ముంగారు పర్మ్’ సినిమాతో ఆమె పేరు కన్నడ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. పూజా గాంధీ రాజకీయ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూజా గాంధీకి విజయే స్వయంగా కన్నడ నేర్పించాడని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, ఇప్పుడు వైవాహిక బంధఃతో ఏకమయ్యారని తెలుస్తోంది.
కాగా 2012లోనే పూజా గాంధీ నిశ్చితార్థం జరిగింది. వ్యాపారవేత్త ఆనంద్ గౌడతో ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే కొన్ని రోజులకే వారిద్దరూ విడిపోయారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో నటించిన పూజా గాంధీ కన్నడతో పాటు తమిళ, బెంగాళీ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఇక దండుపాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇందులో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. ఇక వరుడు విజయ్ విషయానికి వస్తే.. అతనికి బెంగళూరులో సొంత లాజిస్టిక్స్ కంపెనీ ఉంది.
పూజా గాంధీ పెళ్లి ఫొటోస్
🎉🎊 Congratulations #PoojaGandhi and #VijayGhorpade on stepping into marital bliss! May every moment be coloured with love, understanding, and unwavering companionship. Here’s to a beautiful journey filled with shared laughter, endless support, and a lifetime of cherished… pic.twitter.com/cUkIOLn2yG
— A Sharadhaa (@sharadasrinidhi) November 29, 2023
హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
ಮಂತ್ರ ಮಾಂಗಲ್ಯ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಪೂಜಾ ಗಾಂಧಿ ಅವರ ಮದುವೆ 😍@poojagandhi#PoojaGandhi #MantraMangalya #Kuvempu pic.twitter.com/M6697M98g4
— Harish Arasu PRO (@PROHarisarasu) November 29, 2023
పూజా గాంధీ పెళ్లి వీడియో
ಕುವೆಂಪು ಮಂತ್ರ ಮಾಂಗಲ್ಯ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಪೂಜಾಗಾಂಧಿ ಹಾಗೂ ವಿಜಯ್ ಘೋರ್ಪಡೆ ದಾಂಪತ್ಯ ಜೀವನಕ್ಕೆ..#PoojagandhiMarriage #Chigoramesh #Poojagandhi pic.twitter.com/gu20fDvT8O
— Chigo Ramesh (@chigo_ramesh) November 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.