Salaar vs Dunki: షారుఖ్ సినిమాను చూస్తా.. సలార్ వర్సెస్ డంకీ క్లాష్‌పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్
ప్రభాస్ నటించిన 'సలార్' చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో షారూఖ్ ఖాన్ నటించిన 'డంకీ' కూడా విడుదలవుతోంది. రెండు పెద్ద సినిమాలూ ఒకే రోజు రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ ఏర్పడింది. అయితే దీనిపై సలార్ చిత్ర దర్శకుడు, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాస్త ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ కూడా విడుదలవుతోంది. రెండు పెద్ద సినిమాలూ ఒకే రోజు రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ ఏర్పడింది. అయితే దీనిపై సలార్ చిత్ర దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో డంకీ వర్సెస్ సలార్ బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రశాంత్ నీల్ స్పందించారు. ‘కొత్త నటుడైనా లేదా ఇండియన్ సూపర్‌స్టార్ అయినా, ఇలాంటి బాక్సాఫీస్ క్లాష్‌ను ఎవరూ కోరుకోరు. ఏది ఏమైనా నాకు ఇష్టమైన దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరానీ ఒకరు. ‘డంకీ’ సినిమా చూస్తాను. చాలా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘సలార్’ సినిమా కథ గురించి మాట్లాడిన ప్రశాంత్ నీల్.. ఫ్రెండ్ షిప్‌కు సంబంధించిన కథాంశంతో తన సినిమా ఉంటుందన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారనేదే సినిమా కథ. సినిమా మొదటి భాగంలో సగం కథ చెబుతాం, మిగిలిన కథ రెండో భాగంలో ఉంటుంది. ‘ఇద్దరు స్నేహితుల ప్రయాణాన్ని ప్రేక్షకులు మా సినిమాలో చూస్తారు. ‘సలార్’ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ప్రేక్షకులకు మనం సృష్టించిన ప్రపంచం పరిచయం అవుతుంది’ అని నీల్ చెప్పుకొచ్చారు.
భారతదేశంలో ఈ ఏడాది భారీ అంచనాలున్న సినిమాల్లో ప్రభాస్ సలార్ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కన్నడలో వచ్చిన ‘ఉగ్రమ్’కి రీమేక్ అని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండగా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం-శత్రుత్వమే సినిమా కథని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, బాలీవుడ్ నటుడు టిను ఆనంద్, జాకీ మిశ్రా, మధు గురుస్వామి, రామచంద్ర, ఇంకా చాలా మంది నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూరు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
ప్రశాంత్ నీల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..