- Telugu News Photo Gallery Cinema photos Small movie Hanuman Big sensation goes trending in Tollywood Telugu Entertainment Photos
Hanuman: చిన్న సినిమా.. పెద్ద సంచలనాలు.! పాన్ ఇండియా లెవల్లో వండర్స్.
చిన్న సినిమా అని కొన్నింటిని లైట్ తీసుకుంటారు కానీ అలాంటివే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇప్పుడు ఓ సినిమా కాన్ఫిడెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ల ప్రమోషన్స్ చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. సంక్రాంతికి వస్తూ.. సంచలనాలకు రెడీ అంటున్న ఆ సినిమా ఏంటో చూసేద్దామా..? సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు రవితేజ, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. వాళ్ల మధ్యలో నేనున్నానంటూ రేసులో ఉన్న సినిమా హనుమాన్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 29, 2023 | 9:21 PM

చిన్న సినిమా అని కొన్నింటిని లైట్ తీసుకుంటారు కానీ అలాంటివే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఇప్పుడు ఓ సినిమా కాన్ఫిడెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ల ప్రమోషన్స్ చూస్తుంటేనే ముచ్చటేస్తుంది.

సంక్రాంతికి వస్తూ.. సంచలనాలకు రెడీ అంటున్న ఆ సినిమా ఏంటో చూసేద్దామా..? సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు రవితేజ, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. వాళ్ల మధ్యలో నేనున్నానంటూ రేసులో ఉన్న సినిమా హనుమాన్.

రోజురోజుకీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తన కంటెంట్‌తో అలా పెంచేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా హనుమాన్ నుంచి మరో పాట విడుదలైంది. అ!, కల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. హనుమాన్‌తో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు.

మన హనుమంతుడి కంటే గొప్ప సూపర్ హీరో ఎవరూ లేరనేది ఈ చిత్ర కాన్సెప్ట్. తేజ సజ్జా మార్కెట్ కంటే.. నాలుగింతలు ఎక్కువ బడ్జెట్‌తో వస్తుంది హానుమాన్. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం.

బిజినెస్ పరంగానూ హనుమాన్ వండర్స్ చేస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బిజినెస్ కూడా దాదాపు 25 కోట్ల వరకు జరుగుతుందని ఓ అంచనా.

ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు ట్రైలర్ విడుదలయ్యాక క్రేజ్ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్. మొత్తానికి చూడాలిక.. సంక్రాంతికి హనుమాన్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..?





























