తెలంగాణలో ఓట్ల పండగ జోరుగా సాగుతోంది. గురువారం (నవంబర్ 30) ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయిస్తున్నా ఓపికగా క్యూ లైన్లలో నిలబడి మరీ తమ ఓటు బాధ్యతను పూర్తి చేసుకుంటున్నారు.