- Telugu News Photo Gallery Cinema photos Movie reviews and ratings have become a hot topic in the industry
Movie Reviews: ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ రివ్యూలు, రేటింగులు..
సినిమాల రిలీజుల టైమ్‌లో కథేంటి? కమామీషేంటి? ఎంత బాగా వచ్చింది? ఎంత నిడివి వచ్చింది? ఎవరెలా చేశారు? ఎంత బిజినెస్ అయింది? ఎంత రాబట్టొచ్చు... ఇలాంటి విషయాలు మాట్లాడుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌లో వీటన్నిటినీ ఓ విషయం డామినేట్ చేస్తోంది. దాని పేరు రివ్యూ..! ఇండస్ట్రీలో రచ్చ రేపుతున్న రివ్యూల టాపిక్ మీద ఓసారి ఫోకస్ చేద్దామా...
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Nov 30, 2023 | 11:59 AM

సినిమాల రిలీజుల టైమ్‌లో కథేంటి? కమామీషేంటి? ఎంత బాగా వచ్చింది? ఎంత నిడివి వచ్చింది? ఎవరెలా చేశారు? ఎంత బిజినెస్ అయింది? ఎంత రాబట్టొచ్చు... ఇలాంటి విషయాలు మాట్లాడుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌లో వీటన్నిటినీ ఓ విషయం డామినేట్ చేస్తోంది. దాని పేరు రివ్యూ..! ఇండస్ట్రీలో రచ్చ రేపుతున్న రివ్యూల టాపిక్ మీద ఓసారి ఫోకస్ చేద్దామా...

హాయ్ నాన్న ప్రమోషనల్ వీడియోలో రివ్యూల గురించి నాని అన్న మాటలు విన్నారు కదా.. నాని మాత్రమే కాదు, రిలీజ్‌కి దగ్గర పడుతున్న సినిమా ప్రమోషన్ల స్టేజ్‌ల మీద రివ్యూలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

రీసెంట్‌గా కోట బొమ్మాళి మీడియా ఈవెంట్‌లోనూ ఇలాంటివే వినిపించాయి. కేవలం రివ్యూల మీదే సినిమాల హిట్టూ ఫ్లాపూ ఆధారపడుతుందా? ఆ మాటకొస్తే రివ్యూలను అడ్డుకుంటే, ఫ్లాప్ సినిమాలు హిట్ అవుతాయా? అనే చర్చ జరుగుతోంది.

భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలకు రివ్యూలతో పనేంటి? స్టార్ల అభిమాన సైన్యం ఓపెనింగ్స్ తెచ్చేస్తారు కదా అనే వాళ్లూ ఉన్నారు. అసలు రివ్యూ అనే టాపిక్ మీద ఇంత చర్చించాల్సిన అవసరం ఉందా? అనేది మరో వైపు నుంచి వినిపిస్తున్న మాట. సోషల్ మీడియాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మాత్రమే ఈ రేటింగుల గురించి మాట్లాడుకుంటుంటారు.

జస్ట్ ఆ పర్టిక్యులర్ వర్గం మీడియాను పట్టించుకోకపోతే ఇబ్బందే లేదు కదా అంటున్నారు మరికొందరు. ఎవరో ఒకరిద్దరిని పట్టించుకుంటేనే రివ్యూలు, రేటింగులు సమస్యలుగానే కనిపిస్తాయి. అదే వాళ్లని విస్మరిస్తే, ఇండస్ట్రీకి చాలా వరకు మంచే జరుగుతుందన్నది మరికొందరు నిర్మాతల అభిప్రాయం.