మరోవైపు నారా రోహిత్ కూడా పొలిటికల్ సినిమాతోనే వస్తున్నాడు. ప్రతినిథి 2 అంటూ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహం, శపథం, యాత్ర 2 ఓ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే.. వాటికి పోటీగా మరో పార్టీ నుంచి ప్రతినిథి వస్తున్నాడు. మరి వీటిలో ఏది ఎలక్షన్ మూవెంట్‌ను క్యాష్ చేసుకుంటుందో చూడాలి.