AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly Polls 2023: కొనసాగుతున్న పోలింగ్.. ఆ ప్రాంతాల్లో హైఅలర్ట్

వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకోగా వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేసారు. సామాగ్రిని తీసుకుని సాయంత్రంలోగా సిబ్బంది తమతమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పలు డీఆర్‌ఎసీ కేంద్రాలను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించి , సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగనుంది. అయితే సమస్యాత్మక..

Telangana Assembly Polls 2023: కొనసాగుతున్న పోలింగ్.. ఆ ప్రాంతాల్లో హైఅలర్ట్
Ts Elections
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2023 | 9:43 AM

Share

ఓట్ల జాతర వచ్చేసింది. పోలింగ్‌ పండుగ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటరు మహాశయుడు.. వచ్చే ఐదేళ్లకు తెలంగాణ భవితవ్యాన్ని డిసైడ్‌ చేయనున్నాడు. దాదాపు 45 రోజుల ఎన్నికల ప్రక్రియ ఈరోజుతో ముగియబోతోంది. వేలికి ఇంకు.. ఆపై బటన్‌ నొక్కడంతో.. ఓటర్‌ బాధ్యత పూర్తి కాబోతోంది. అటు వేలాది మంది పోలింగ్‌ సిబ్బంది. లక్షమంది బలగాలు ఓట్ల జాతరలో తమ విధులు నిర్వర్తించబోతున్నారు.

వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకోగా వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేసారు. సామాగ్రిని తీసుకుని సాయంత్రంలోగా సిబ్బంది తమతమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పలు డీఆర్‌ఎసీ కేంద్రాలను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించి , సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగనుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది, 19,375 ప్రాంతాల్లో 35,356 పోలింగ్‌ కేంద్రాలు, 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు 22వేల మైక్రోఅబ్జర్వర్‌లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దాదాపు 1.85 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో 35,356 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు. అందులో 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్‌లను, స్క్వాడ్‌లను నియమించారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది.

బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగంలోకి దించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ పూర్తయిన తర్వాత..డిసెంబర్‌ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెలువరించనున్నారు.

ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టుల పిలుపు:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ములుగు, జయశంకర్‌ భూపలపల్లి ఏజెన్సీలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయంతో భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగనుంది.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి