Nagarjuna Sagar: నాగార్జున డ్యాం వద్ద ఉద్రిక్తత వాతావరణం..కంచె ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 500 మందికి పైగా ఏపీ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అనగా.. 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దీనిని టీఎస్ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.

Nagarjuna Sagar: నాగార్జున డ్యాం వద్ద ఉద్రిక్తత వాతావరణం..కంచె ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు..
Follow us
Srikar T

|

Updated on: Nov 30, 2023 | 6:59 AM

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 500 మందికి పైగా ఏపీ పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అనగా.. 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దీనిని టీఎస్ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం తలెత్తింది.

ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఏపీ పోలీసులతో మాట్లడారు. డ్యామ్‌కు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని, ప్రస్తుతం వేసిన ముళ్ల కంచెను తొలగించాలని తెలిపారు. ఈ విషయంపై ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో డీఎస్పీతో సహా అక్కడకు చేరుకున్న సిబ్బంది వెనుతిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు.. తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. నీటి విడుదలతో పాటూ భద్రతపై తెలంగాణ ప్రభుత్వమే ఇప్పటి వరకూ అన్ని రకాలా చర్యలను చేపడుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడికి మీడియాను ఉన్నతాధికారులు అనుమతించడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కోమటి రెడ్డి స్పందన ఇలా..

నాగార్జున సాగర్ ఉద్రిక్త పరిస్థితిపై కాంగ్రెస్ నల్గొండ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారన్నారు. ఇప్పుడు వందలమంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. తాగునీటి పేరుతో కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నారన్నారు కోమటి రెడ్డి. పోలింగ్‌ రోజు తెలంగాణ సెంటిమెంట్‌ పండించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ నాటి దీక్ష ఫొటోలతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ ఇదంతా చేస్తోందని స్పందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..